● లొంకలో భక్తుల సందడి
సిరికొండ: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ప్రముఖ శైవ పుణ్యక్షేత్రమైన లొంకలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. మాఘ శుద్ధ బహుళ అమావాస్యను పురస్కరించుకొని లొంకలోని రామలింగేశ్వర స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు అవధూత గంగాధర్, ఎన్నం రాజారెడ్డి, తాళ్ల శ్రీనివాస్, బడాల సంతోష్, మారుతి, నవీన్, భూపతి, రాజు, బోయిడి ప్రకాశ్, నాగేశ్, ప్రశాంత్, వినీల్‌రెడ్డి, భాస్కర్, రాజు, రామకృష్ణ, నరేశ్, మోహన్, ప్రసాద్, సతీశ్, భూషణ్, నాగేశ్, గంగాధర్, లక్ష్మణ్, శ్రీరాం చారి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
జక్రాన్‌పల్లి: మండలంలోని పడకల్‌లో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహించారు. అమావాస్యను పురస్కరించుకుని గంగనీటిని తీసుకొచ్చి గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. గ్రామస్తులు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తిరుపతిరెడ్డి, రాజేశ్వర్‌గౌడ్, భాస్కర్, శివ, రవి, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.
సిరికొండ: మండలంలోని పెద్ద వాల్గోట్ గ్రామ సమీపంలోని త్రీ హిల్స్ అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయంలో జాతరను ఆదివారం వైభవంగా నిర్వహించారు. గుట్ట పైన ఉన్న ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గుట్ట కింద అమ్మవారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. సిరికొండ, ధర్పల్లి, భీంగల్ మండలాల నుంచి జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి రథం లాగేందుకు భక్తులు పోటీపడ్డారు.
నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో అమావాస్యను పురస్కరించుకొని భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నీలకంఠేశ్వర ఆలయం, మనోకామేశ్వరఆలయం, శంభు లింగేశ్వర ఆలయం, లలిత ఆశ్రమాలయం లలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. జానకంపేటలోని అష్టముఖి కోనేరులో భక్తులు స్నానాలు ఆచరించారు.
ఆధ్యాత్మికం
● లొంకలో భక్తుల సందడి
● లొంకలో భక్తుల సందడి
● లొంకలో భక్తుల సందడి


