మున్సిపోల్స్‌పై పంచాయతీ ప్రభావం
మోర్తాడ్: పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు అ భ్యర్థుల ఖర్చు అంచనాలకు మించిపోవడంతో ఆ ప్రభావం మున్సిపల్ ఎన్నికల్లో ఉంటుందనే అభి ప్రాయం వ్యక్తమవుతోంది. పల్లెల్లోనే రూ. లక్షల్లో ఖర్చు చేస్తే పట్టణాల్లో అంతకు మించి ఖర్చు పెరుగుతుందనే చర్చ జరుగుతోంది. భీమ్‌గల్ మున్సిపాలిటీలో 12 వార్డులు, ఆర్మూర్ మున్సిపాలిటీలో 36 వార్డులకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించనున్నారు. సామాజిక వర్గాలు, మహిళల వారీగా రిజర్వేషన్లు తేల్చడంతో ఏ వార్డులో ఎవరు పోటీ చే యడానికి అర్హులో అనే స్పష్టత వచ్చింది. మున్సిప ల్ ఎన్నికల్లో పోటీచేసి తమ రాజకీయ భవితవ్యాన్ని తేల్చుకోవాలనే ఆశతో ఉన్న నాయకులు ఖర్చులపై లెక్కలు వేసుకుంటున్నారు. అధికార కాంగ్రెస్‌తోపాటు బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల తరఫున పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్న నాయకులు ప్రచారం ఖర్చు, బహుమతులు, విందుల కోసం ఎంత ఖ ర్చు చేయాలనే ఆలోచనలో పడ్డారు. ఎన్నికల నోటి ఫికేషన్ త్వరలోనే వెలువడనుండగా పోటీలో నిలవాలనుకునే నాయకులు తమ ఎన్నికల ఖర్చుల కోసం నిధుల సమీకరణపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఆర్మూర్ డివిజన్‌లో పంచాయతీ ఎన్నికలు తుది విడతలో జరిగాయి. అప్పట్లో ఈ డివిజన్‌లో వివిధ పంచాయతీల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఖర్చు రూ.30 కోట్లకు మించింది. మేజర్ పంచాయతీల్లో జరిగిన ఖర్చును పరిగణలోకి తీసుకుంటున్న అభ్యర్థులు తమ తమ వార్డులలో ఎంత వరకు ఖర్చవుతుందో అంచనాలను సిద్ధం చేసుకుంటున్నారు. గ త ఎన్నికల్లో భీమ్‌గల్‌లో ఒక్కో వార్డులో ఒక ప్ర ధాన పార్టీ అభ్యర్థులు రూ.10 లక్షల వరకూ సొంతంగా ఖర్చు చేయగా పార్టీ ఫండ్‌గా ఒక్కో అభ్య ర్థికి రూ.5 లక్షల వరకు నిధులు అందించినట్లు సమాచారం. ప్రస్తుతం పార్టీ నుంచి నిధులు వచ్చినా, రాకపోయినా సొంతంగా కనీసం రూ.15 లక్షల వరకు ఖర్చు చేయాలనే ఆలోచనలో నాయకులు ఉన్నట్లు తెలిసింది. ఇక చైర్మన్ పీఠాన్ని ఆశించేవారు మాత్రం రెండింతల ఖర్చు ఎక్కువ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కౌన్సిలర్ అభ్యర్థులకు కూడా తాము సొంతంగా ఎంతో కొంత నిధులు సమకూర్చాలనే భావనలో చైర్మన్ పీఠంపై గురిపెట్టిన అభ్యర్థులు ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఎన్నికల సంఘం సూచించే ఖర్చుల పరిమితికి క్షేత్రస్థాయిలో జరిగే ఖర్చుకు ఎంతో తేడా ఉండనుందని చెప్పవచ్చు.
పంచాయతీ ఎన్నికల్లో భారీగా
ఖర్చు చేసిన అభ్యర్థులు
ఆ ప్రభావం మున్సిపల్ ఎన్నికల్లో
చూపుతుందనే భావన
వార్డుకు పోటీ చేస్తే రూ. 15 లక్షలకు పైనే ఖర్చు అవుతుందని అంచనా
పార్టీ ఫండ్ వచ్చినా, రాకపోయినా నిధులు సమీకరించుకోవాలనే నిర్ణయం


