నూతన కార్యవర్గం ఎన్నిక
సుభాష్‌నగర్: నగరంలోని గాయత్రినగర్‌లో గాయత్రి చైతన్య కమిటీ సర్వసభ్య సమావే శం ఆదివారం నిర్వహించారు. సభ్యులు గాయత్రి చైతన్య కమి టీ నూతన కార్యవర్గా న్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా బేతి సంజీవరెడ్డి, అధ్యక్షుడిగా ఆడెపు నరేంద్ర స్వామి, ఉపాధ్యక్షుడిగా కట్ట శంకరయ్య, ప్రధాన కార్యదర్శిగా దోమల పండరి, సహాయ కార్య దర్శులుగా బాస ప్రవీణ్, బొద్దుల లక్ష్మణ్, కోశాధికారిగా భూమేశ్వర్, కార్యవర్గ సభ్యులుగా అందె లక్ష్మణ్, ప్రవీణ్, పళ్లికొండ ప్రవీణ్, సలహాదారులుగా గర్ధాస్ శంకర్, గజ్జెల లింబాద్రి చారి, బల్ల నారాయణ ఎన్నుకున్నారు.
జక్రాన్‌పల్లి: మండలంలోని పడకల్ గ్రామంలో స్వేరోస్ నెట్‌వర్క్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ లోక స్వప్న, ఉపసర్పంచ్ పురుషోత్తంరెడ్డి లను స్వేరోస్ ప్రతినిధులు ఆదివారం ఘనంగా సన్మానించారు. అంబేడ్కర్ చిత్ర పటాన్ని సర్పంచ్‌కు బహూకరించారు. సర్పంచ్, ఉపసర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులు భవదీప్, సత్తెమ్మలను సత్కరించారు. ఈ సందర్భంగా స్వేరోస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ సాయి మాట్లాడుతూ.. నూతన పాలకవర్గం విద్యా, వైద్యాఽనికి అధిక ప్రాధాన్యత కల్పించి అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. స్వేరోస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ సాయి, స్వేరోస్ ప్రతినిధులు, ఎంపీడీవో గంగాధర్, సంజీవ్‌రావు, లిఖిత్, పిల్లి సంజీవ్, వంశీ, నాయకులు అంకం రాజేందర్, వొల్కాజీ విఠల్, మూడ శ్రీనివాస్ పాల్గొన్నారు.
క్రీడాకారిణికి అభినందన
ధర్పల్లి: మండలంలోని మద్దుల్ తండాకు చెందిన క్రీడాకారిణి గౌతమి ఇటీవల హర్యానాలో నిర్వహించిన జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి విజయం సాధించారు. ఈ మేరకు ధర్పల్లి మాజీ ఎంపీపీ నల్ల సారిక, బీఆర్‌ఎస్ నాయకులు ఆమెను ఘనంగా సన్మానించారు. నాయకులు హనుమంత్ రెడ్డి, కొట్టాల గంగారెడ్డి, మాజీద్, నాజీర్, రవి, రాజేశ్వర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
108 అంబులెన్స్‌లో ప్రసవం
ఆర్మూరుటౌన్: ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీకి చెందిన సోనీ అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబీకులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సిబ్బంది ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో సోని ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సిబ్బంది ఆస్పత్రిలో చేర్పించగా తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని ఈఎంటీ జగదీశ్, పైలట్ గణేశ్ తెలిపారు.
నూతన కార్యవర్గం ఎన్నిక


