యువత క్రీడలపై ఆసక్తి చూపాలి
డిచ్‌పల్లి: యువత క్రీడలపై ఆసక్తి చూపాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి అన్నారు. యువత గ్రామాభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవచ్చని ఆయన సూచించారు. డిచ్‌పల్లి మండలంలోని తన సొంత గ్రామం ముల్లంగి (ఐ)లో ఆదివారం నిర్వహించిన ఎంపీఎల్–2026 (ముల్లంగి ప్రీమియర్ లీగ్) క్రికెట్ టోర్నమెంట్‌లో విజేత జట్టుకు నగేశ్‌రెడ్డి ట్రోఫీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి కృషి చేస్తోందని అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సహకారంతో ముల్లంగి(ఐ) గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ నర్సయ్య, ఉప సర్పంచ్ అశోక్, వీడీసీ అధ్యక్షుడు నితిన్, క్రికెట్ విన్నర్ టీమ్ కెప్టెన్ హరీశ్, రన్నర్ టీమ్ కెప్టెన్ లక్ష్మణ్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.


