అన్వేషణ
న్యూస్‌రీల్
నిజామాబాద్
గెలుపు గుర్రాల కోసం వేట
● టికెట్ల కోసం అన్ని పార్టీల్లోనూ తీవ్ర పోటీ
● మొదలైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ
● మేయర్ పీఠంపై కన్నేసిన
ప్రధాన పార్టీలు
ప్రథమ పౌరులారా..
బడి బాగుంటే ఊరు బాగుంటుంది. మన ఊరి బడిని బతికించుకుందాం. సమస్యల పరిష్కారానికి సర్పంచులు కృషి చేయాలి
సోమవారం శ్రీ 19 శ్రీ జనవరి శ్రీ 2026
– 8లో u
సుభాష్‌నగర్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై కన్నేసిన ప్రధాన పార్టీలు.. గెలుపు గుర్రాల అన్వేషణలో పడ్డాయి. పేరు ప్రఖ్యాతలతోపాటు ధన, కుల బలాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మేయర్ పీఠం దక్కించుకోవాలని అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లు ఉండగా.. 3.48 లక్షల మంది ఓటర్లు, 488 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మేయర్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ కాగా, 15 స్థానాలు జనరల్, 15 జనరల్ మహిళ, 12 బీసీ జనరల్, 12 బీసీ మహిళ, 3 ఎస్సీ జనరల్, 2 ఎస్సీ మహిళ, ఒకటి ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ అయ్యాయి. గత రెండు పర్యాయాలు మేయర్ పీఠం మహిళలకే దక్కగా, ఈసారి కూడా మహిళకే కేటాయించారు. రిజర్వేషన్లు అనుకూలించిన నేతలు ఇప్పటికే రంగంలోకి దిగారు. టికెట్ల కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బడా నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో ఆశావహులు నిమగ్నమయ్యారు.
విజయం సాధించే సత్తా ఉన్న వారి కోసం..
నిజామాబాద్ నగరంలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నాయి. ఆయా పార్టీల్లో ఆశావహులు భారీగానే ఉన్నప్పటికీ.. మేయర్ పీఠం కై వసం చేసుకోవాలంటే గెలుపొందే అవకాశమున్న అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఆయా పార్టీల నాయకత్వాలు నిమగ్నమయ్యాయి. మరోవైపు ఆశావహులు సైతం సొంత పార్టీ టికెట్ ఇవ్వకుంటే మరో పార్టీ బీ ఫామ్‌తో, లేకుంటే స్వతంత్రంగా పోటీ చేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా అభ్యర్థుల పేర్లతో ఓ ప్రధాన పార్టీ సర్వేలుసైతం చేపడుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాగా ప్రధాన పార్టీలకు రెబల్స్ బెడద తప్పేలా లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
భారీ సంఖ్యలో ఆశావహులు
కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి బరిలో దిగేందుకు ఎక్కువమంది ఆసక్తితో ఉన్నారు. బీఆర్‌ఎస్, ఎంఐఎంసైతం గట్టి పోటీ ఇచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీల్లో ఒక్కో డివిజన్‌కు సగటున 4 నుంచి 5 దరఖాస్తులు వస్తున్నట్లు తెలిసింది. పోటీ తీవ్రంగా ఉన్నచోట గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థులకే టికెట్ ఇవ్వాలని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఆశావహుల నుంచి కాంగ్రెస్ సోమవారం నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నది.
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన రిజర్వేషన్ల ఘట్టం ముగియడంతో అటు పార్టీలు గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తుండగా.. ఇటు ఆశావహులు టికెట్ల కోసం తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆయా పార్టీలు జిల్లాలో కీలకమైన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.
నేటి నుంచి దరఖాస్తులు..
నిజామాబాద్ రూరల్: పార్టీ అధిష్టానం ఆదేశానుసారం సోమవారం నుంచి ఆశావహుల దరఖాస్తులను స్వీకరించనున్నట్లు నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ తెలిపారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలకరులతో మాట్లాడారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్న వారు ఉదయం 10 గంటల నుంచి కాంగ్రెస్ భవన్‌లో దరఖాస్తులు అందజేయాలని ఆయన సూచించారు.
అన్వేషణ
అన్వేషణ


