రేపటి నుంచి వన్యప్రాణుల గణన
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో వన్యప్రాణుల గణనకు అటవీ శాఖ సిద్ధమైంది. ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు మొత్తం ఆరు రోజులపాటు అడవుల్లో సర్వే చేపట్టనున్నారు. జిల్లాలో పులులతోపాటు ఇతర వన్యప్రాణులు ఎన్ని ఉన్నాయో అంచనా వేయనున్నారు. ఇందుకోసం గతేడాది నవంబర్‌లోనే ఫారెస్ట్ అధికారులు శిక్షణ పొందగా, ఇటీవల డివిజన్ వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించారు. వన్యప్రాణుల గణనకు అవసరమైన పరికరాలను అందజేశారు. మొదటి మూడు రోజులు మాంసహార జంతువులను, తర్వాతి మూడు రోజులు శాఖహార జంతువులను లెక్కిస్తారు. వన్యప్రాణుల గణనలో బీట్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్లు, డిప్యూటీ ఎఫ్‌ఆర్వోలు, రేంజ్ ఆఫీసర్లు, ఎఫ్‌డీవోలు పాల్గొననున్నారు.
అటవీ విస్తీర్ణం 86,871.45 హెక్టార్లు!
జిల్లాలో 86,871.45 హెక్టార్ల మేర అటవీ విస్తీర్ణం ఉంది. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ కోసం సిరికొండ, కమ్మర్‌పల్లి, ఇందల్వాయి, నిజామాబాద్‌సౌత్, నిజామాబాద్‌నార్త్, వర్ని, ఆర్మూర్ రేంజ్‌లు ఉన్నాయి. జిల్లాలో అటవీ శాఖ లెక్కల ప్రకారం పెద్దపులులు లేకపోగా, చిరుతలు, ఎలుగుబంట్లు, అడవి కుక్కలు, అడవి పిల్లులు, జింకలు, మానుబోతులు, తోడేళ్లు, నక్కలు, నెమళ్లు ఉన్నాయి. చివరిసారిగా 2021లో వన్యప్రాణుల గణన చేపట్టగా, మళ్లీ ఇప్పుడే దేశమంతటా ఒకేసారి జరుగుతోంది. ఫారెస్ట్ అధికారులు అడవుల్లో తిరిగి పాదముద్రలు, ట్రాప్ కెమెరాలు, తదితర మార్గాల ద్వారా వన్యప్రాణుల సంఖ్యను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించనున్నారు.
ఈనెల 25 వరకు అడవుల్లో సర్వే
ఆరు రోజులపాటు కొనసాగనున్న ప్రక్రియ
మొదటి మూడు రోజులు
మాంసాహార.. తరువాతి మూడు రోజులు శాఖాహార జంతువుల లెక్కింపు
చివరిసారిగా 2021లో అడవి జంతువుల గణన
రేపటి నుంచి వన్యప్రాణుల గణన
రేపటి నుంచి వన్యప్రాణుల గణన
రేపటి నుంచి వన్యప్రాణుల గణన
రేపటి నుంచి వన్యప్రాణుల గణన
రేపటి నుంచి వన్యప్రాణుల గణన


