అల్లమ ప్రభు జాతరకు మొదటిసారి వచ్చా
● ప్రభుత్వ సలహాదారు పోచారం
నస్రుల్లాబాద్: బొమ్మన్‌దేవ్‌పల్లిలో ఏటా నిర్వహించే అల్లమ ప్రభు జాతరకు తొలిసారి వచ్చానని ప్రభు త్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రామ నాయకులు తనను జాతరకు పిలవడంలో అలసత్వం చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన జాతరలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ అల్లమ ప్రభు జాతర కుల మతాలకు అతీతంగా జరుగుతుందన్నారు. ఆలయ భూములు, అటవీ భూము లు అన్యాక్రాంతం అవుతున్నాయని తెలిసిందన్నా రు. అధికారులతో చర్చించి భూముల పరిరక్షణకు చర్యలు చేపడతామన్నారు. ఆయన వెంట ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్, సర్పంచ్ సాయిలు, నాయకులు పాల్త్య విఠల్, కంది మల్లేష్, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


