‘ఆఫీసర్స్‌ క్లబ్‌’కు సహకారం అందిస్తాం | - | Sakshi
Sakshi News home page

‘ఆఫీసర్స్‌ క్లబ్‌’కు సహకారం అందిస్తాం

Jan 17 2026 11:41 AM | Updated on Jan 17 2026 11:41 AM

‘ఆఫీస

‘ఆఫీసర్స్‌ క్లబ్‌’కు సహకారం అందిస్తాం

‘ఆఫీసర్స్‌ క్లబ్‌’కు సహకారం అందిస్తాం ‘మహారాష్ట్ర’ ఫలితాలు ఇందూరులో పునరావృతం

ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి

సుభాష్‌నగర్‌: నిజామాబాద్‌ ఆఫీసర్స్‌ క్లబ్‌ కార్యకలాపాలకు తమ పూర్తి సహకారం అందిస్తామని ప్రభుత్వ సలహాదారు, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం నగరంలోని తన నివాసంలో సుదర్శన్‌రెడ్డిని ఆఫీసర్స్‌ క్లబ్‌ కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ సామాజిక, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాల గురించి ఆయనకు వివరించారు. క్లబ్‌ భవిష్యత్తు కార్యక్రమాలకు సహకారం, మార్గనిర్దేశనం అందించాలని ఆయనను కోరారు. ఆఫీసర్స్‌ క్లబ్‌ ఉపాధ్యక్షుడు తాహెర్‌బిన్‌ హందాన్‌, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జలగం తిరుపతి రావు, జాయింట్‌ సెక్రెటరీ శ్యాంసుందర్‌ రెడ్డి, కోశాధికారి సురేశ్‌ గాడ్‌, దేవిదాస్‌, భూపాల్‌ రెడ్డి, రాంరెడ్డి, పురన్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ

సుభాష్‌నగర్‌: మహారాష్ట్రలో జరిగిన మున్సిప ల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు.. ఇందూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో పునరావృతం కావడం ఖాయమని అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ ధీమా వ్యక్తంచేశారు. గురువారం మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై నగరంలోని గాంధీచౌక్‌లో బీజేపీ కార్యకర్తలతో కలిసి సంబరాలు నిర్వహించారు. టపాకాయ లు కాల్చి, మిఠాయిలు పంచిపెట్టారు. అనంత రం ధన్‌పాల్‌ మాట్లాడుతూ రాబోయే మున్సిపల్‌కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఇందూరు కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. మాజీ కార్పొరేటర్లు, నాయకులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, జ్యోతి, కోడూరి నాగరాజు, బంటు రాము, మాస్టర్‌ శంకర్‌, ప్రభాకర్‌, శీల శ్రీనివాస్‌, మఠం పవన్‌, విజయ్‌ కృష్ణ, పంచరెడ్డి శ్రీధర్‌, చింతకాయల రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

‘సాగర్‌’కు 1.129

టీఎంసీల నీరు చేరిక

నిజాంసాగర్‌(జుక్కల్‌): సంగారెడ్డి జిల్లాలోని సింగూరు జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తుండటంతో శుక్రవారం సాయంత్రం వరకు నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి 1.129 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ఈనెల 10 నుంచి సింగూరు ప్రాజెక్టు నుంచి మంజీరా నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఈ నెల 13న సింగూరు జలాలు నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి చేరుకున్నాయి. నిజాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు 17.8 టీఎంసీలకు గాను ప్రస్తుతం 1403 అడుగులు 14.978 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,185 క్యూసెక్కుల జలాలు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతున్నట్లు నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు.

నియామకం

ఖలీల్‌వాడి: జిల్లా ఉపాధ్యాయ పండిత పరిషత్‌ అధ్యక్షుడిగా కేతటి చిదానందరెడ్డి, జిల్లా ప్రధా న కార్యదర్శిగా ప్రమోద్‌కుమార్‌ నియామకం అయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహులు, రా ష్ట్ర ప్రధాన కార్యదర్శి శశికుమార్‌ యాదవ్‌ వీరి ని శుక్రవారం నియమించారు. జిల్లాలోని అన్ని రకాల భాషల ఉపాధ్యాయులకు అండగా నిలుస్తూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా మని వారు అన్నారు.

‘ఆఫీసర్స్‌ క్లబ్‌’కు  సహకారం అందిస్తాం
1
1/3

‘ఆఫీసర్స్‌ క్లబ్‌’కు సహకారం అందిస్తాం

‘ఆఫీసర్స్‌ క్లబ్‌’కు  సహకారం అందిస్తాం
2
2/3

‘ఆఫీసర్స్‌ క్లబ్‌’కు సహకారం అందిస్తాం

‘ఆఫీసర్స్‌ క్లబ్‌’కు  సహకారం అందిస్తాం
3
3/3

‘ఆఫీసర్స్‌ క్లబ్‌’కు సహకారం అందిస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement