ఆఫర్ల పేరుతో నకిలీ లింక్‌లు..
● పండుగ పూట వాట్సాప్ గ్రూపుల్లో
ఫేక్ లింక్‌లు
● ఓపెన్ చేసిన వెంటనే
మరిన్ని గ్రూపుల్లోకి ఫార్వర్డ్
డొంకేశ్వర్: ‘మొదట ఇది నకిలీ అనుకున్నాను కానీ నిజంగా నాకు రూ. ఐదు వేలు వచ్చాయి. మీరు కూ డా ట్రై చేయండి’ అంటూ ‘సంక్రాంతి ఆఫర్లు, గిఫ్ట్ లు’ పేరుతో ఫేక్ లింక్‌లు గత మూడు రోజులుగా వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో వైరల్ అవుతున్నాయి. ఫో న్ పే, తదితర లోగోలతో ఉన్న లింకులు వాట్సాప్ గ్రూపుల్లోకి ఎక్కువగా వెళ్లడంతో చాలామంది మొబైల్ ఫోన్ యూజర్లు ఇది నిజమే కావొచ్చని నమ్మి లింక్‌ను ఓపెన్ చేస్తున్నారు. తద్వారా వారి నంబర్ల నుంచి ఇతర వాట్సాప్ గ్రూపుల్లోకి ఫార్వర్డ్ అవుతున్నాయి. ఫేక్ లింక్‌ను ఓపెన్ చేయడంతో వా రి వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తున్నా యి. బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు మాయమ య్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ కూడా అప్రమత్తమైంది.
ఈ లింక్ ఎందుకు ప్రమాదకరం?
● లింక్ చివరలో xyz డొమెన్ ఉంటుంది.
● నమ్మదగిన బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు ఇలాంటి లింక్‌లు ఉపయోగించవు.
● లింక్ ఓపెన్ చేయగానే వివరాలు అడిగే అవకాశం ఉంది.
● మొబైల్ నంబర్, ఓటీపీ, యూపీఐ, బ్యాంకు వివరాలు తీసుకుని ఖాతా ఖాళీ చేసే ప్రమాదముంది.
● మొబైల్ హ్యాక్ కావడం, వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అవుతుంది.
● ఇప్పటికే లింక్ క్లిక్ చేసి ఉంటే బ్యాంక్ పాస్‌వర్ట్, యూపీఐ మార్చండి.
● బ్యాంకు కస్టమర్ కేర్‌కు సమాచారం ఇవ్వండి, 1930కు కాల్ చేయండి.
డబ్బు సులభంగా వచ్చేస్తుందని చెప్పే ఆఫర్లను నమ్మొద్దు. మొబైల్ ఫోన్లలో వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో వచ్చే లింక్‌లు, ఏపీకే ఫైల్స్‌ను తెరవకూడదు. వాటిని ఓపెన్ చేస్తే సైబర్ మోసాలకు గురవుతారు. డబ్బులు పోయే ప్రమాదముంది. ఇప్పటికే లింక్‌లు నొక్కిన వారు ఉంటే వెంటనే సైబర్ పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
– శ్యామ్‌రాజ్, ఎస్సై, నందిపేట్
ఆఫర్ల పేరుతో నకిలీ లింక్‌లు..


