అధికార పార్టీ అత్యుత్సాహం
● రిజర్వేషన్లకు ముందే ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ
● సర్వే నిర్వహించి గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామంటున్న అధినాయకత్వం
ఆర్మూర్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ కాంగ్రెస్ టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య రో జు రోజుకీ పెరుగుతోంది. అయితే రిజర్వేషన్‌లు ఖ రా రు కాకముందే ఆశావహుల నుంచి ఆ పార్టీ దర ఖాస్తులు తీసుకుంటోంది. రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేయనున్నారు. రిజర్వేషన్లు 50 శాతానికే పరిమితం కాగా కార్పొరేటర్, కౌన్సిలర్ సీట్లను బీ సీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీలకు దామాషా పద్ధతిలో కేటాయించనున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్‌తోపా టు ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్ మున్సిపాలిటీల్లో సామాజిక వర్గాల వారీగా ఓటర్ల తుది జాబితాను సిద్ధం చేసిన తరువాత రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే అధికార పార్టీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో వారు ఏ వార్డు నుంచి పోటీ చేయాలనుకుంటున్నారో పేర్కొంటూ పార్టీ జిల్లా నాయకత్వానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సర్వే నిర్వహించి గెలుపు గుర్రాలకు టికెట్లు కేటాయిస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. కానీ రిజర్వేషన్లు ఖరారు కాకముందే పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం, వాటిని స్వీకరించండం చర్చనీయాంశమైంది. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్‌లకు సుమారు 300 మంది ఆశావహులు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. ఆర్మూర్‌లో36 వార్డులకు 140 మంది, భీమ్‌గల్‌లో 12 వార్డులకు సుమారు 40 మంది దర ఖాస్తు చేసుకున్నట్లు ఆయా పట్టణాల పార్టీ అధ్యక్షులు తెలిపారు. ఈ సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. బోధన్ మున్సిపాలిటీ పరిధిలో మాత్రం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాలేదు.


