వైఎస్ జగన్‌పై అభిమానం
● ఉప్లూర్‌లో ఫ్లెక్సీల ఏర్పాటు
కమ్మర్‌పల్లి: వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై అ భిమానంతో సంక్రాంతి పండగ నేపథ్యంలో శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మండలంలోని ఉప్లూర్‌లో వైఎస్ జగన్ అభిమాని ఈర్నాల మారుతి, మరో 40 మంది యువకులు కలిసి మంగళవారం గ్రామంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకున్నారు. గ్రామ స్తులకు భోగి, సంక్రాంతి, మహా శివరాత్రి పండగ శుభాకాంక్షలు తెలుపుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ జగన్, ఆయన సతీ మణి భారతి చిత్రాలతో గ్రామ స్వాగతతోరణం నుంచి శివారు వరకు కూడళ్లు, వీధుల్లో 150 పైగా చిన్న ఫ్లెక్సీలు, 6 పెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జగన్ బర్త్‌డేను యువకులు డిసెంబర్‌లో ఘనంగా నిర్వహించారు. 10 కిలోల కేక్ కట్ చేశారు.
గ్రామ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు
వైస్ రాజశేఖర్‌రెడ్డి, జగన్ చిరత్రాలతో ఫ్లెక్సీ..
వైఎస్ జగన్‌పై అభిమానం


