ప్రభుత్వ ఆస్పత్రిలోనే కాన్పులు జరిగేలా చూడాలి
కమ్మర్‌పల్లి: ప్రతి గర్భిణీ ప్రభుత్వ ఆస్పత్రిలోనే కాన్పు చేయించుకునేలా వైద్యులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి రాజశ్రీ అన్నారు. కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, చౌట్‌పల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం డీఎంహెచ్‌వో తనిఖీ చేశారు. టీ హబ్‌కు పంపుతున్న రక్త నమూనాల వివరాలను, మందుల వివరాలు, నిల్వలను ఎల్‌టీ, ఫార్మాసిస్ట్‌ను అడిగి తెలుసుకున్నారు. గర్భిణులకు అందుతున్న సేవల గురించి, ఆస్పత్రిలో కాన్పుల సంఖ్య తగ్గడానికి గల కారణాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కాన్పుల సంఖ్యను పెంచాలని వైద్యాధికారులు స్పందన, నరసింహాస్వామిని ఆదేశించారు. ఆరోగ్య విస్తరణ అధికారి సత్యనారాయణ, సిబ్బంది స్వరూప, పద్మ తదితరులు పాల్గొన్నారు.


