భువిపై రంగుల హరివిల్లు | - | Sakshi
Sakshi News home page

భువిపై రంగుల హరివిల్లు

Jan 14 2026 7:15 AM | Updated on Jan 14 2026 7:15 AM

భువిప

భువిపై రంగుల హరివిల్లు

పాత కలెక్టరేట్‌ గ్రౌండ్‌లో ముగ్గులు వేస్తున్న మహిళలు, యువతులు, చిన్నారులు

నిజామాబాద్‌లోని పాత కలెక్టరేట్‌ మైదానమంతా రంగుల హరివిల్లు పరుచుకుంది. సంక్రాంతి పర్వదినం నేపథ్యంలో సాక్షి దినపత్రిక, కిసాన్‌ ఫ్యాషన్‌మాల్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు మహిళాలోకం పోటెత్తింది. మతాలకు అతీతంగా పోటీల్లో పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు. న్యాయనిర్ణేతలు ముగ్గులను పరిశీలించి, ప్రతిభ చూపిన వారికి బహుమతులను అందజేశారు.

నిజామాబాద్‌ రూరల్‌: నగ రంలోని పాత కలెక్టరేట్‌ మై దానం మంగళవారం ‘సాక్షి’, కిసాన్‌ ఫ్యాషన్‌ మాల్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు మహిళలు, యువతులు త రలివచ్చారు. ఈసందర్భంగా పలువురు బోగి, సంక్రాంతి, కనుమ, ప్రస్తుతం స మాజంలో ఆడపడుచులపై జరిగే ఆకృత్యాలపై ముగ్గులు వేసి అవగాహన కల్పించారు. న్యాయనిర్ణేతలుగా డిప్యూటీ డీఎంహెచ్‌వో అశ్విని, ప్రము ఖ న్యాయవాది సరళమహేంధర్‌రెడ్డి, డాక్టర్‌ కవితారెడ్డి వ్య వహరించారు. వారు ముగ్గులను పరిశీలించి, ప్రథ మ, ద్వితీయ, తృతీయ, కన్సోలేషన్‌ ముగ్గులను ఎంపిక చేశారు. అంతకుముందు డిప్యూటీ డీఎంహెచ్‌వో అశ్విని మాట్లాడుతూ.. ఇంటిముందు వేసే రంగవల్లులు ఇంటిలోకి లక్ష్మీదేవిని ఆహ్వానించిన ట్లు అవుతుందని పేర్కొన్నారు. మహిళలను ఉత్సాహపరిచేందుకు సాక్షి రంగవల్లుల కార్యక్రమం చేపట్టడం ఎంతో సంతోషకరమన్నారు. న్యాయవాది సరళమహేందర్‌రెడ్డి మాట్లాడుతూ..‘సాక్షి’ ముగ్గుల పోటీలను పారదర్శకంగా నిర్వహించారన్నారు. డాక్టర్‌ కవితారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత డిజిటల్‌ యుగంలో యువతులు ముగ్గులు వేయడం మరిచారని, ఈ పోటీలతో మేల్కొని వారు ముగ్గులను నేర్చుకొని పోటీల్లో పాల్గొనాలన్నారు. మైనారిటీ మహిళలు సైతం ‘సాక్షి’ ముగ్గుల పోటీల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈసందర్భంగా ‘సాక్షి’ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. సాక్షి నిజామాబాద్‌ ఏడీవీటీ మేనేజర్‌ సంపత్‌ మా ట్లాడుతూ.. హిందూ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి ముగ్గులని అన్నారు. ఇంటి ముందు ముగ్గులు వేస్తే ఇల్లు అందంగా కనిపిస్తుందని, పెద్దల నుంచి వస్తున్న సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలని కోరారు. సాక్షి ఆధ్వర్యంలో న్యాయనిర్ణేతలకు మెమోంటోలను ప్రదా నం చేశారు. సాక్షి మేనేజర్‌(ఏడీవీటీ) నాగుర్ల సంపత్‌, స్టాఫ్‌ అజయ్‌, దీక్షిత్‌, ఎస్‌ఆర్‌ రాంనాథ్‌, రిపోర్టర్‌ రజినీష్‌, ఆపరేటర్‌ దాసరి ఆనంద్‌కుమార్‌, సాక్షి టీవి కరస్పాండెంట్‌ కిరణ్‌రెడ్డి, ఆర్‌సీ ఇన్‌చార్జి సంజీవ్‌, ఫొటోగ్రాఫర్‌ రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

నగరంలో అట్టహాసంగా ‘సాక్షి’ ముగ్గుల పోటీలు

మతాలకు అతీతంగా పాల్గొన్న

మహిళలు, యువతులు

అందరికీ బహుమతుల ప్రదానం

భువిపై రంగుల హరివిల్లు 1
1/4

భువిపై రంగుల హరివిల్లు

భువిపై రంగుల హరివిల్లు 2
2/4

భువిపై రంగుల హరివిల్లు

భువిపై రంగుల హరివిల్లు 3
3/4

భువిపై రంగుల హరివిల్లు

భువిపై రంగుల హరివిల్లు 4
4/4

భువిపై రంగుల హరివిల్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement