పిప్రి వాసికి పీహెచ్‌డీ పట్టా
కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): భీమ్‌గల్ మండలం పిప్రి(జె) గ్రామపంచాయతీ పరిధిలోని మహాలక్ష్మి తండాకు చెందిన మాలవత్ పూర్ణ చందర్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జంతుశాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా పొందారు. ఓయూ కాలేజ్ ఆఫ్ సైన్స్‌లో ఎమ్మెస్సీ జువాలజీ పూర్తి చేసిన పూర్ణచందర్, పీహెచ్‌డీ జంతుశాస్త్రం ప్రొఫెసర్ సునీతదేవి పర్యవేక్షణలో ప్రొఫెసర్లు మాధవి, జితేంధర్‌కుమార్ నాయక్, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ రెడ్యా నాయక్ ఆధ్వర్యంలో ‘హెమటాలాజికల్, బయోకెమికల్ ఆల్టరేషన్ ఇన్ చెన్న స్ట్రయోటస్ ఫెడ్ విత్ హై డైటరీ లిపిడ్’ అనే అంశంపై ఓయూలో పరిశోధన చేసి, పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్నారు. పరిశోధనలు పలు అంతర్జాతీయ జర్నల్స్‌లలో ప్రచురితం అయ్యాయి. కొర్రమీను చేప (చెన్న స్ట్రయోటస్) ఆహారంలో లిపిడ్ చేర్చడం, కొర్రమీను చేప పెరుగుదలపై పరిశోధనలు చేశారు. తన పరిశోధనలకు గాను ఓయూ వీసీ చేతుల మీదుగా ఈనెల 9న పీహెచ్‌డీ పట్టా అందుకున్నట్లు పూర్ణచందర్ మంగళవారం తెలిపారు.
జక్రాన్‌పల్లి: జేఎంకేపీఎం పసుపు రైతు ఉత్పత్తిదార్ల సంఘం నుంచి ఉత్పత్తి అవుతున్న పసుపునకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలని సంఘం అధ్యక్షుడు తిరుపతిరెడ్డి కోరారు. ఈమేరకు ఆయన మంగళవారం సెర్ప్ తెలంగాణ చీఫ్ ఆపరేటింగ్ అగ్రికల్చర్ ఆఫీసర్ నరెడ్ల రజితను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. సెర్ప్ ద్వారా ప్రజలకు నాణ్యమైన పసుపుతో పాటు సరసమైన ధరలకు అందించాలన్నారు. రజిత మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో మా శాఖ తరపున కచ్చితంగా సహా య సహకారాలు అందిస్తామని, త్వరలోనే పరిశ్రమను సందర్శిస్తామని హామీ ఇచ్చారు. అధికారులు జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్: నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి ట్రాన్స్‌జెండర్లు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈసందర్భంగా ట్రాన్స్‌జెండర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఓరుగంటి గంగ, ప్రధాన కార్యదర్శి జరీనా బేగం మాట్లాడుతూ..ట్రాన్స్ జెండర్లకు మున్సిపాలిటీల్లో కోఆప్షన్ సభ్యులుగా రాజకీయ అవకాశాన్ని సీఎం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలోనే జిల్లా ట్రాన్స్‌జెండర్స్ సొసైటీ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించామన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నాయకుడు రేవంత్ రెడ్డి అని ఆయనకు మా సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ నాయకులు మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివక్షత లేని ప్రజాపాలన కొనసాగిస్తున్నారన్నారు. ట్రాన్స్ జెండర్స్ నాయకులు శ్యామల, లైలా, అమల, అనేకమంది ట్రాన్స్ జెండర్లు పాల్గొన్నారు.
పిప్రి వాసికి పీహెచ్‌డీ పట్టా
పిప్రి వాసికి పీహెచ్‌డీ పట్టా


