క్రైం కార్నర్
బాన్సువాడ: సంగారెడ్డి జిల్లా జోగిపేటలో జరిగిన రోడ్డుప్రమాదంలో బాన్సువాడ మండలం దేశాయిపేట్‌కు చెందిన ఓ వ్యక్తి మృతిచెందాడు. వివరాలు ఇలా.. దేశాయిపేట్‌కు చెందిన దేవా సక్సెనా (55) విలేకరిగా పనిచేస్తున్నాడు. సోమవారం హైదరాబాద్‌లో ఉన్న తన కుమారుడిని తీసుకురావడానికి బైక్‌పై వెళ్లాడు. మంగళవారం తన కుమారుడితో కలిసి అతడు బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరారు. జోగిపేట వద్ద వారి బైక్‌కు పంది అడ్డం రావడంతో వాహనం అదుపుతప్పింది. దీంతో వెనకాల కూర్చున్న దేవా సక్సెనా రోడ్డుపై పడటంతో తీవ్రగాయాలై, అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన కుమారుడు హెల్మెట్ పెట్టుకోవడంతో స్వల్ప గాయాలయ్యాయి.
తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఇటీవల ఆత్మహత్యకు యత్నించిన ఓ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై నరేష్ తెలిపిన వివరాలు ఇలా.. తా డ్వాయి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన చెట్కూరి యశ్వంత్ (24) తండ్రి మల్లయ్య నెలన్నర రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి మరణంతో అతడు జీవితమై విరక్తి చెంది ఈనెల 8న గ్రామ శివారులో గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అతడిని చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డిపేటలో గల ప్రయివేట్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ సో మవారం సాయంత్రం మృతి చెందాడు. మృతుడి తల్లి రాజవ్వ ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదుచేసుకొని కామారెడ్డి ఏరియా హాస్పిటల్‌లో పోస్టుమార్టం చేయించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
కన్నాపూర్‌లో వృద్ధుడు..
లింగంపేట(ఎల్లారెడ్డి): ఇటీవ ఆత్మహత్యకు యత్నించిన ఓ వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై దీపక్‌కుమార్ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన దేవ సోత్ వసురాం(60) కొన్ని నెలలుగా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య కారణాలతో బాధపడుతుండేవాడు. దీంతో అతడు జీవితంపై విరక్తి చెంది వా రం రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే కుటుంబసభ్యులు అతడిని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
క్రైం కార్నర్
క్రైం కార్నర్


