కాటేపల్లిలో వివాహిత ఆత్మహత్య
పెద్దకొడప్‌గల్(జుక్కల్): మండలంలోని కాటేపల్లి గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. కాటేపల్లి గ్రామానికి చెందిన తులసి (25)ని భర్త రాందాస్ నిత్యం మద్యం తాగి వచ్చి వేధించేవాడు. సోమవారం రాత్రివేళలో రాందాస్ తాగి వచ్చి భార్యను వేధించాడు. దీంతో తులసి జీవితంపై విరక్తి చెంది అర్ధరాత్రి ఇంటి స్లాబ్ ఇనుప ఉక్కుకు చున్నితో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, తహసీల్దార్ భిక్షపతి ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు.
శాంతిపురంలో ఒకరు..
కామారెడ్డి క్రైం: కామారెడ్డి మండలం శాంతిపురం గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. శాంతిపురం గ్రామానికి చెందిన కంచర్ల నవీన్ కుమార్(32) కూలి పని చేసుకునేవాడు. కొద్దిరోజులుగా మద్యానికి బానిసకావడంతోపాటు ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. దీంతో అతడు జీవితంపై విరక్తి చెంది మంగళవారం మధ్యా హ్నం ఇంట్లో దూలానికి తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రంజిత్ తెలిపారు.


