ఆత్మహత్యకు యత్నించిన వృద్ధురాలు
● కాపాడి కుటుంబీకులకు
అప్పగించిన పోలీసులు
రెంజల్ (బోధన్): మండలంలోని కందకుర్తి గోదావరి వంతెన వద్దకు వచ్చిన ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు కాపాడి, ఆమె కుటుంబీకులకు అప్పగించారు. వివరాలు ఇలా.. రెంజల్ గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు ఇటీవల కుటుంబంలో జరిగిన చిన్న గొడవతో మనస్తాపానికి గురైంది. దీంతో మంగళవారం కందకుర్తి సమీపంలోని గోదావరి వంతెన వద్దకు చేరుకొని అనుమానాస్పదంగా తిరిగింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రెంజల్ ఎస్సై చంద్రమోహన్ సిబ్బందితో అక్కడికి చేరుకుని వృద్ధురాలిని సముదాయించారు. స్టేషన్‌కు తీసుకువచ్చి కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు.


