అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు
నిజామాబాద్ అర్బన్: విధి నిర్వహణలో అలసత్వాన్ని ప్రదర్శిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి అధికారులు గైర్హాజరుకావడ ంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గైర్హాజరైన అధికారులకు మెమోలు జారీ చేసిన కలెక్టర్.. మరోసారి గైర్హాజరైతే వేతనంలో కోత విధిస్తామని హెచ్చరించారు. కొందరు అధికారులు ముందు ఉన్న సీట్లలో కూర్చోకపోవడాన్ని గమనించిన కలెక్టర్.. ముందు సీట్లలో ఎందుకు కూర్చుకోవడం లేదు? ఏమైనా ఇ బ్బందులు ఉన్నాయా? అని ఆగ్రహం వ్యక్తం చే శారు. మొత్తం 84 వినతులు అందగా వాటిని పరిశీలించిన కలెక్టర్ పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందించారు. ప్రజావాణి వినతుల స్వీకరణ పూర్తయిన తరువాత శాఖల వా రీగా అధికారుల హాజరు జాబితాను పరిశీలించా రు. ఇది మొదటి తప్పుగా భావించి మెమోలతోనే సరిపెడుతున్నామని, ఇక నుంచి గైర్హాజరయ్యే అధి కారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజావాణి ప్రాధాన్యతను గుర్తెరిగి జిల్లా అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని అన్నారు. ముఖ్యంగా విద్య, వైద్య రంగాలకు చెందిన అధికారులు, సిబ్బంది సమయపాలనను పాటిస్తూ, సేవాభావంతో విధులు నిర్వర్తించాలని అన్నారు. ఇటీవల తాను ఆర్మూర్ ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేసిన సమయంలో పలువురు విధుల్లో లేరని, ఈ తరహా నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని అన్నా రు. మండలాల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని ఆదేశించారు. ప్రజావాణిలో జెడ్పీ సీఈవో సాయాగౌడ్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, హౌసింగ్ పీడీ పవన్‌కుమార్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
అధికారులపై కలెక్టర్ ఇలా త్రిపాఠి
సీరియస్
ప్రజావాణికి గైర్హాజరైన వారికి మెమోలు
మరోసారి గైర్హాజరైతే అయితే వేతనంలో కోత అని హెచ్చరిక


