సఫారీ రైడ్‌కు రెఢీ
● బ్యాక్ వాటర్‌లో ఎకో టూరిజం కోసం..
● జిల్లాకు చేరిన మూడు వాహనాలు
డొంకేశ్వర్(ఆర్మూర్): ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతంలో ఎకో టూరిజం ఏర్పాటులో భాగంగా జిల్లాకు సఫారీ వాహనాలు వచ్చేశాయ్. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది మూడు సఫారీ వాహనాలను మంజూరు చేసింది. ఒక్కో వాహనానికి రూ.15లక్షలు కేటాయించగా ఇప్పుడు అవి సిద్ధమై జిల్లాకు చేరుకున్నాయి. వాహనాలను జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో ఉంచారు. పర్యాటకులు, అధికారులు, ముఖ్య ప్రజాప్రతినిధులు ప్రయాణించేలా వీటిని డిజైన్ చేశారు. కాగా ఆకట్టుకునేలా వాహనాల వెనుక భాగంలో పక్షులు, జింకలు, టైగర్ ఫోటోలను ముద్రించారు. అధికారులు ప్రస్తుతం వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించే పనిలో ఉన్నారు. త్వరలోనే ప్రజాప్రతినిధులతో వాహనాలను ప్రారంభించి అందుబాటులోకి తేనున్నట్లు ఆర్మూర్ ఎఫ్‌డీవో భవానీ శంకర్ ‘సాక్షి’కి వెల్లడించారు.
సఫారీ రైడ్‌కు రెఢీ


