జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ తొందరపాటు నిర్ణయం
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి
నిజామాబాద్ రూరల్: రాష్ట్రంలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటు నిర్ణయం తీసుకుంటుందని జీజేపీ జిల్లా అద్యక్షుడు కులచారి దినేశ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాస్వామిక పద్ధతిలో నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించాలన్నారు. గతంలో బీఆర్‌ఎస్ చేసిన తప్పునే ప్రస్తుత కాంగ్రెస్ చేస్తుందని విమర్శించారు. మేడారం జాతరకు బస్సు చార్జీలు పెంచకుండా, సబ్సిడీ ఇవ్వాలని కోరారు. భక్తులకు ఉచిత, తక్కువ చార్జీలతో సౌకర్యవంతమైన రవాణా సౌకర్యం కల్పించాలన్నారు.
ఎల్లారెడ్డిరూరల్:విషపురుగు కా టు వేయడంతో వృద్ధురాలు మృతి చెందిన ఘటన మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రా మంలో సోమవారం చోటు చే సుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామాని కి చెందిన గాదె సాయవ్వ(60) సోమవారం పొలంలో నాటు వేసేందుకు వెళ్లగా విషపురుగు కాటు వేసింది. ఏదో పురుగు కరిచిందని భావించిన సా యవ్వ.. అలాగే పని చేసింది. కాసేపటికి ఆమె నోటి నుంచి నురగలు రావడంతో ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. వైద్యులను సంప్రదించగా పోస్టుమార్టంలో విషపురుగు వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు.


