క్రీడలతో మానసికోల్లాసం
● కమాండెంట్ సత్యనారాయణ
● బెటాలియన్‌లో అన్యువల్
స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
డిచ్‌పల్లి: క్రీడలతో శారీరక దారుఢ్యంతోపాటు మానసికోల్లాసం పెంపొందుతుందని తెలంగాణ ప్రత్యేక పోలీస్ ఏడో బెటాలియన్ కమాండెంట్ పి.సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం బెటాలియన్‌లో ఇంటర్ కంపెనీ వార్షిక క్రీడా పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కమాండెంట్ సత్యనారాయణ క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం క్రీడాజ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బందిలో శారీరక ధృడత్వం, మానసిక స్థైర్యం, క్రమశిక్షణ పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. బెటాలియన్‌లోని వివిధ కంపెనీలకు చెందిన సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారు.
క్రీడలతో మానసికోల్లాసం


