రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

Dec 24 2025 3:52 AM | Updated on Dec 24 2025 3:52 AM

రాష్ట

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక పరికరాలతో విద్యా బోధన సులభం

సిరికొండ: రాష్ట్ర స్థాయి సాప్ట్‌బాల్‌ పోటీలకు గడ్కోల్‌ జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికై నట్లు పాఠశాల పీడీ నవీన్‌, జీహెచ్‌ఎం శ్రీకాంత్‌లు మంగళవారం తెలిపారు. జక్రాన్‌పల్లి మండలం తొర్లికొండలో ఈ నెల 21న జరిగిన సబ్‌ జూనియర్‌ ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబర్చిన గాండ్ల భానువర్దన్‌, బుక్యా మౌనికలు జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని వారు తెలిపారు. మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌లో ఈ నెల 24, 25 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జట్టు తరపున పాల్గొంటారని తెలిపారు. ప్రైమరీ స్కూల్‌ హెచ్‌ఎం శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ధర్పల్లి: ప్రాథమిక స్థాయిలో బోధన పరికరాలతో బోధన సులభమవుతుందని మండల రిసోర్స్‌ పర్సన్లు అంకం నరేష్‌, వెంకట రాజారెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో జరిగిన కాంప్లెక్స్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు సృజనాత్మకంగా బోధించడానికి అభ్యసనం సులభం కావడానికి, బోధన పరికరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు గణితంకు సంబంధించి వివిధ బోధన పరికరాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం శ్రీనివాస్‌, ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక1
1/1

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement