భూవివాదంలో ఘర్షణ
● ఇరువర్గాలపై కేసు నమోదు
నవీపేట: మండలంలోని శివతండాలో శనివారం జరిగిన భూ వివాదంలో ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. వివరాలు ఇలా.. శివతండాకు చెందిన బానోత్ మోహన్, అబ్బాపూర్(బి) తండాకు చెందిన పండిట్‌ల మధ్య గత కొన్ని రోజులుగా భూవివాదంలో గొడవలు జరుగుతున్నాయన్నారు. ఇరువురి మధ్య రాజీ కుదిర్చేందుకు ఇరువర్గాల పెద్దలు శనివారం శివతండాలో పంచాయతీ పెట్టారన్నారు. ఈక్రమంలో మాటమాట పెరిగి ఇరువర్గాల వారు ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో పెద్దమనిషి నెనావత్ కీర్యాకు తీవ్ర గాయాలయ్యాయి. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు ఇరువర్గాలకు చెందిన పలువురిపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.
మద్నూర్(జుక్కల్): మండలంలో ని పెద్ద శక్కర్గాలో షార్ట్‌సర్క్యూట్‌తో కారులో మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధం అయింది. వివరాలు ఇ లా.. గ్రామానికి చెందిన జంగం శివప్ప కొన్ని రోజు ల క్రితమే కొత్తగా టాటా పంచ్ కారు కొనుగోలు చేశాడు. శుక్రవారం రాత్రి అతడు తన ఇంటి ముందు కారును పార్క్ చేశాడు. రాత్రి 11 గంటల సమయంలో ప్రమాదవశాత్తు షార్ట్‌సర్క్యూట్‌తో కా రులో మంటలు అంటుకున్నాయి. వెంటనే మద్నూ ర్ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వగా, వారు ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. కానీ అప్పటికే కారు పూర్తిగా కాలిపోయిందని బాధితుడు శివప్ప వాపోయాడు. ఈ ఘటనపై పొలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నాడు.
రుద్రూర్: కోటగిరి మండలం ఎత్తొండ క్యాంపులో తాళం వేసిన ఇంట్లో పగటి పూట చోరి జరిగింది. ఎస్సై సునీల్ తెలిపిన వివరాలు ఇలా.. ఎత్తొండ క్యాంపు గ్రామానికి చెందిన షేక్ షాదుల్ శనివారం ఉదయం ఇంటికి తాళం వేసి పని నిమిత్తం గ్రామ పంచాయతీకి వెళ్లాడు. మధ్యాహ్నం వేళ ఇంటికి వచ్చే సరికి తా ళం పగులగొట్టి, తలుపులు తెరిచి ఉండడం గమ నించాడు. బెడ్‌రూంలో ఉన్న బీరువా తెరిచి ఉండగా అందులో దాచిన రూ. 70వేలు నగదు చోరీకి గురైనట్టు బాధితుడు గుర్తించి కోటగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సునీల్ తెలిపారు.
భూవివాదంలో ఘర్షణ


