ఆమే.. కీలకం! | - | Sakshi
Sakshi News home page

ఆమే.. కీలకం!

Dec 8 2025 8:12 AM | Updated on Dec 8 2025 8:12 AM

ఆమే..

ఆమే.. కీలకం!

పల్లె పోరులో నారీమణుల ఓట్లే ఎక్కువ

జిల్లాలో 57,843 మహిళా ఓట్లు అధికం

గెలుపోటముల్లో చూపనున్న అతివల ప్రభావం

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజేతను నిర్ణయించడంలో మహిళా ఓట్లు కీలకం కానున్నాయి. జిల్లాలో 3,96,778 మంది పురుష ఓటర్లు ఉండగా.. మహిళా ఓటర్లు 4,54,621 మంది ఉన్నారు. ఈ లెక్కన పురుషులతో పోలిస్తే మహిళలు 57,843 మంది ఎక్కువగా ఉన్నారు. చాలా మంది పురుషులు ఉపాధి, ఉద్యోగాల కోసం విదేశాలు, పట్టణాలకు వెళ్లగా.. పల్లెల్లో స్థానికంగా ఉన్న మహిళలు మాత్రం పక్కాగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

– సుభాష్‌నగర్‌

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మహిళా ఓటర్లు కీలకంగా మారారు. ఆయా పంచాయతీల పరిధిలో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. నారీమణులు ఎటువైపు మొగ్గు చూపి తే వారినే విజయం వరించే అవకాశం ఉంది. జిల్లాలోని 31 మండలాల పరిధిలో 545 గ్రామపంచాయతీలు ఉండగా, మొత్తం 8,51,417 ఓటర్లున్నారు. అందులో 3,96,778 పురుషులు, 4,54,621 మహిళలు, 18 ఇతర ఓటర్లు ఉన్నారు. పురుషులతో పోలిస్తే పంచాయతీ ఓటర్లలో 57,843 మహిళల ఓట్లు అధికంగా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ పురుషుల కన్నా మహిళా ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు పంచాయతీ ఎన్నికల్లో 50శాతం మహిళా అభ్యర్థులతోపాటు జనరల్‌ స్థానాల్లోనూ సర్పంచ్‌, వార్డుసభ్యులుగా మహిళలు పోటీ చేస్తున్నారు. దీంతో పురుషుల కన్నా పల్లె పోరు అధికంగా మహిళలే ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కానున్నారు. అంటే ఓట్లు, సీట్లలోనూ అబలలే అధికంగా ఉన్నారు.

పురుష ఓటర్లు గల్ఫ్‌ దేశాల్లో..

జిల్లాలో ఉన్న 3,96,778 పురుష ఓటర్లలో సగటున 20శాతానికిపైగా విద్య, ఉపాధి, ఉద్యోగాల పేరుతో గల్ఫ్‌ దేశాలతోపాటు యూరప్‌, అమెరికా లాంటి దేశాలకు వలస వెళ్లారు. దీంతో పురుషుల పోలింగ్‌శాతం మరింత తగ్గనుంది. దీంతో అభ్యర్థుల గెలుపోటముల లో మహిళల ఓట్లు అధిక ప్రభావం చూపనున్నా యి. విదేశాల్లో ఉన్న వారికి అభ్యర్థులు ప్రత్యేకంగా ఫోన్లు చేసి వారి కుటుంబ సభ్యులతో తమకు ఓట్లు వేయించాలని అభ్యర్థిస్తున్నారు.

వారి ఓట్లపై అభ్యర్థుల ఫోకస్‌

సర్పంచ్‌, వార్డుస్థానాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు పంచాయతీ ఎన్నికల గెలుపోటముల్లో కీలకంగా ఉన్న మహిళల ఓట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. గతంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు చీరలు, కానుకలు ఇచ్చిన ఘటనలు ఉన్నాయి. తాజాగా నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉన్న పంచాయతీల్లో మహిళా సంఘాల సభ్యులను ప్రసన్నం చేసుకునేలా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటి ప్రచారానికి వెళ్లినప్పుడు వారికి బొట్టు పెట్టి మరీ తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.

మండలాల వారీగా ఓట్ల వివరాలు..

ఆమే.. కీలకం!1
1/4

ఆమే.. కీలకం!

ఆమే.. కీలకం!2
2/4

ఆమే.. కీలకం!

ఆమే.. కీలకం!3
3/4

ఆమే.. కీలకం!

ఆమే.. కీలకం!4
4/4

ఆమే.. కీలకం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement