రెండో విడత రెండో రోజు 1661
సుభాష్‌నగర్: గ్రామపంచాయతీ ఎన్నికల రెండో విడత పోరులో నామినేషన్ల స్వీకరణ గడువు మంగళవారం సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. రెండోరోజు సర్పంచ్ పదవులకు 456 మంది, వార్డు స్థానాలకు 1205 మంది నామినేషన్లు దాఖలు చేశారు. రెండు రోజుల్లో 196 సర్పంచ్ స్థానాలకు 578 నామినేషన్‌లు, 1,760 వార్డు స్థానాలకు 1,353 నామినేషన్‌లు అందాయి. కేంద్రాల వద్ద పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందితో హెల్ప్‌డె స్క్‌లు, పోలీస్ సిబ్బంది బందోబస్తు ఏర్పాటుచేశారు. నిజామాబాద్ రెవెన్యూ డివిజన్‌తోపాటు ఆర్మూర్ డివిజన్‌లోని జక్రాన్‌పల్లి మండలంలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మంచి రోజు కావడంతో
సోమవారం ఏకాదశి మంచి రోజు కావడంతో భారీ సంఖ్యలో నామినేషన్లు దా ఖలయ్యాయి. చివరి రోజై న మంగళవారం నామపత్రాలు అంతంత మాత్రంగానే వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఆది, సోమవారాల్లో జరిగిన చర్చలు విఫలమైన గ్రామాలకు సంబంధించిన పదవులకు మంగళవారం నామినేషన్లు దాఖలయ్యే అవకాశముందని పలువురు పేర్కొంటున్నారు. ఏకగ్రీవాల కోసం కూడా అధికార పార్టీ నాయకులు చక్రం తిప్పుతున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్‌శాఖ పకడ్బందీ చర్యలు చేపడుతోంది.
రెండో విడత రెండో రోజు మండలాలవారీగా దాఖలైన నామినేషన్లు
సర్పంచ్ స్థానాలకు 456,
వార్డు స్థానాలకు 1205
నేటితో రెండో విడత నామినేషన్లకు
ముగియనున్న గడువు
చివరి రోజు అంతంతే వచ్చే అవకాశం!
రెండో విడత రెండో రోజు 1661


