తెగుళ్లకు బెడ్‌తో చెక్
● పసుపును బెడ్ విధానంలో
సాగు చేసిన ముప్కాల్ రైతు
● అధిక వర్షాలు కురిసినా
పంటకు సోకని తెగుళ్లు
బాల్కొండ: పసుపు పంటను బెడ్ విధానంలో సాగు చేయడంతో తెగుళ్లకు చెక్ పెట్టవచ్చని ఉద్యావన శాఖ అధికారి రుద్ర వినాయక్ తెలిపారు. ముప్కాల్‌లో రైతు లోక నరేష్‌రెడ్డి బెడ్ విధానంలో సాగు చేసిన పంటలో ఎలాంటి తెగుళ్లు లేకుండా, ఎపుగా పెరిగిందన్నారు. దీంతో రైతులు బెడ్ విధానంలో పసుపు సాగుచేసుకోవాలని వారు ఒక ప్రకటనలో పేర్కొంటున్నారు. పసుపు పంటను విత్తే ముందు సదరు రైతు ఎకరానికి 5 ట్రాక్టర్ల కోళ్ల పేడ ఎరువుతో పాటు వర్మి కంపోస్ట్ నేలలో వేశాడు. మీటర్ వెడల్పు, 20 సెంటీ మీటర్ల ఎత్తు, 30 సెంటీమీటర్లు దూరంతో బెడ్‌ను తయారు చేసుకున్నాడు. బెడ్‌కు రెండు వైపులా పసుపు పంటను విత్తాడు. ప్రస్తుతం అధికంగా వర్షాలు కురిసినా ఈ విధానంతో పంటలో నీరు నిల్వ లేకుండా పోయింది. దీంతో పసుపు పంటకు ఎలాంటి చీడలు వ్యాపించలేదు. పంట పచ్చగా ఏపుగా ఉండటంతోపాటు పసుపు కర్రలు దృఢంగా, పసుపు కొమ్ములు కూడ భూమి పగిలి బయటకు వస్తున్నాయి.
దీంతో భారీ దిగుబడి వస్తుందని అధికారులు అంచన వేస్తున్నారు. పసుపు పంటకు తెగుళ్లు సోక కుండ ఆరోగ్యంగా ఉండటంపై రైతు ఆనందం వ్య క్తం చేస్తున్నారు. బెడ్ విధానంలో సాగు చేసుకోవడంతో సాధా రణం కంటే 20 శాతం అధికంగా దిగుబడి వస్తుందని అధికారులు తెలిపారు.
తెగుళ్లకు బెడ్‌తో చెక్


