ప్రారంభోత్సవానికి సిద్ధమైన శ్రీవారి ఆలయం
● కుక్కలగుట్ట వేంకటేశ్వర ఆలయంలో ఈనెల 5నుంచి ఉత్సవాల నిర్వహణ
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్‌లోగల కుక్కలగుట్ట వేంకటేశ్వర ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇటీవల ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో పెర్కిట్ గ్రామాభివృద్ధి కమిటీ వారు నూతన ఆలయాన్ని నిర్మించడానికి సంకల్పించారు. దీంతో భక్తులు రూ.కోటి 20 లక్ష లు విరాళంగా ఇవ్వగా వీడీసీ వారు రూ.60 లక్షలు వ్యయం చేశారు. అలాగే ఆలయ ప్రాంగణాన్ని సుందరీకరించడానికి, తుది మెరుగులకు మరో రూ.20 లక్షల వరకు వ్యయం అయ్యే అవకాశం ఉంది. మూ డున్నర ఎకరాల సువీశాల స్థలంలో వేంకటేశ్వర మందిరంతోపాటు శివాలయం, నవగ్రహ ఆలయా న్ని నిర్మించారు. ఆలయ నిర్మాణం పూర్తవడంతో వీడీసీ ఆధ్వర్యంలో ఈనెల 5 నుంచి 7వరకు విగ్రహాల పున:ప్రతిష్ఠాపన ఉత్సవాలను నిర్వహించనున్నారు. కార్యక్రమానికి హైదరాబాద్‌కు చెందిన శ్రీ గురు మధనానంద సరస్వతీ పీఠాధిపతి మాధవా నంద సరస్వతి స్వామి, నందిపేట కేదారీశ్వర ఆశ్ర మ వ్యవస్థాపకుడు బాలయోగి మంగి రాములు మహారాజ్, ఆదిలాబాద్ బ్రహ్మశ్రీ ఆగస్త్య శాసీ్త్ర, పెర్కిట్ మోహన్ రావు జోషి వేద మంత్రోచ్చరణల మధ్య విగ్రహాలను పున:ప్రతిష్ఠించనున్నారు.


