సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాకు వ్యవ సాయ కళాశాల మంజూరు చేయడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞ్ఞతలు తెలిపారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు.
రెవెన్యూ సిబ్బంది బదిలీ
నిజామాబాద్ అర్బన్: రెవెన్యూశాఖలోని తొమ్మిది మంది సిబ్బందిని బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈనెల 15న ప్రచురితమైన ‘రేషన్‌కార్డుల్లో భారీ అక్రమాలు’ కథనంపై అధికారులు స్పందించారు. వివిధ మండలాల్లో అనర్హులకు రేషన్‌కార్డులు మంజూరు చేశారని రెవెన్యూ సిబ్బందిని వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారు.
పసుపు రైతుల
సంక్షేమానికి కృషి
● జాతీయ పసుపు బోర్డు చైర్మన్
పల్లె గంగారెడ్డి
సుభాష్‌నగర్: పసుపు రైతుల సంక్షేమం కో సం జాతీయ పసుపు బోర్డు ఎల్లప్పుడూ పని చేస్తుందని బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అ న్నారు. వరంగల్, ఏపీలోని అరకు జిల్లా పా డేరు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన పలువురు రైతులు శుక్రవారం నగరంలోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని సందర్శించారు. పల్లె గంగారెడ్డి వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యా రు. పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఉత్పత్తి వ్యయం, మార్కెట్‌లో ధరల అస్థిరత, పంట సంరక్షణలో ఎదురయ్యే సవాళ్లు వంటి అంశాలపై పరిష్కార మార్గాలను చర్చించారు.
పాఠశాలకు
రూ.50 వేల విరాళం
మోపాల్ : మోర్తాడ్ మండలంలోని సిర్‌పూర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు దూస లక్ష్మణ్ విద్యా ఆశయం స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున రూ.50 వేల ఆర్థిక సాయాన్ని శుక్రవారం ప్రధానోపాధ్యాయులు వి సత్యనారాయణకు అందజేశారు. ఈసందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ పాఠశాలలో రెండు సంవత్సరాలుగా జరుగుతున్న వివిధ విద్య అభివృద్ధి పనులు గమనించి ఆర్థికసాయాన్ని అందజేశారని తెలిపారు. అనంతరం సంస్థ ప్రతినిధులు దూస దాసు, ఆరు గొండ దయానంద్ మాట్లాడుతూ విద్యా ర్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గెలుచుకున్న బహుమతులను గుర్తించి, వారి ప్రతిభా పాటవాలను మరింత ప్రోత్సహించేలా ఈ విద్యానిధిని అందించినట్లు పేర్కొన్నారు. తెలుగు ఉపాధ్యాయులు డాక్టర్ కాసర్ల నరేష్‌రావు చొరవతో పాఠశాల అవసరాలను గుర్తించి ఈ నిధిని అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్యామల, మోహన్, అక్బర్ బాషా, డాక్టర్ శ్రీనివాస్ హజారే, లలిత, విద్యార్థులు పాల్గొన్నారు.
సీఎంకు సుదర్శన్‌రెడ్డి కృతజ్ఞతలు
సీఎంకు సుదర్శన్‌రెడ్డి కృతజ్ఞతలు