నిజాలు రాస్తే వేధింపులా..! | - | Sakshi
Sakshi News home page

నిజాలు రాస్తే వేధింపులా..!

Oct 18 2025 10:01 AM | Updated on Oct 18 2025 10:01 AM

నిజాల

నిజాలు రాస్తే వేధింపులా..!

బాబుది నిరంకుశ పాలన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అక్రమ నిర్బంధం తగదు కూటమి ప్రభుత్వం వెనక్కు తగ్గాలి మీడియాను తొక్కిపెట్టడమే..

‘సాక్షి’పై అక్రమ కేసులను ఎత్తి వేయాలి

నినదించిన జర్నలిస్టు, వామపక్ష, విద్యార్థి, సంఘాల ప్రతినిధులు

జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ, ధర్నా

నిజామాబాద్‌లోని ధర్నాచౌక్‌లో నిరసనలో పాల్గొన్న ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు, జర్నలిస్టులు

(803)

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నిరంకుశ పాలన కొనసాగుతోంది. గతంలోనే చంద్రబాబు ప్రపంచ బ్యాంకు జీతగాడు అని మేమే వ్యతిరేకించాం. ప్రజా పాలనను పక్కనపెట్టి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నాడు. కొన్నేళ్లుగా ఇదే విధానం కొనసాగుతోంది. పత్రికలపై కక్షపూరిత చర్యలు సిగ్గుచేటు, అక్రమ కేసులు బనాయించడం, ఎదుటి వారిని బెదిరించడం అలవాటుగా మార్చుకున్నాడు. తక్షణమే సాక్షి మీడియాపై పెట్టిన కేసులను వెనక్కు తీసుకోవాలి. ఇతర మీడియాలు కూడా సాక్షికి మద్దతుగా నిలవాలి. మీడియాపై ఎవరు కేసులు నమోదు చేసినా, కక్షపూరిత చర్యలకు పాల్పడినా అందరూ ఒక్కటై కలిసికట్టుగా ఎదుర్కోవాలి. మీడియాకు మేము అండగా ఉంటాం. –వి. ప్రభాకర్‌, సీపీఐ (ఎంఎల్‌)మాస్‌లైన్‌ ప్రజాపంథ రాష్ట్ర నాయకుడు

సాక్షి మీడియా నిజాలు రాస్తే చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించింది. ఇది ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ. మీడియాను తన గుప్పిట్లో పెట్టుకుని అరాచకాలు సష్టించాలని చంద్రబాబు చూస్తున్నాడు. దీనికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. –ముస్కు సుధాకర్‌,

టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి

నిజామాబాద్‌అర్బన్‌ : ‘సాక్షి’ దిన పత్రికపై, ఎడిటర్‌ ఆర్‌. ధనంజయ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేయడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో శుక్రవారం జర్నలిస్టు సంఘాలు, వామపక్ష సంఘాలు, విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. సంఘాల ప్రతినిధులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని, మీడియా లేకుంటే ప్రజల హక్కులు హరించుకుపోతాయన్నారు. అలాంటి మీడియాపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేయడాన్ని తీవ్రంగా ఎండగట్టారు.

మొదట ఎన్టీఆర్‌ చౌరస్తా నుంచి కోర్టు చౌరస్తా వరకు, తిరిగి ఎన్టీఆర్‌ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు ధర్నా చేశారు.

కూటమి ప్రభుత్వం ప్రజాస్వా మ్యానికి సంకెళ్లు వేస్తోంది. కక్షపూరితమైన విధానాలు కొన సాగిస్తోంది. తన తప్పులను వెలికి తీసేందుకు ప్రయత్నించే వారిని అక్రమంగా నిర్బంధిస్తున్నారు. పత్రిక విలేకరులపై కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేయడమంటే దారుణం. ప్రజాస్వామ్యంలో మీడియాకు స్వేచ్ఛ లేకుంటే ప్రజలు ఎలా బతికేది.

–ఖైసర్‌, కాంగ్రెస్‌ జిల్లా నాయకుడు

చంద్రబాబు పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని తుద ముట్టించాలని ప్రయ త్నం చేస్తున్నాడు. తన తప్పుల ను వెలికి తీసే వారి పై అక్రమ కేసులు బనాయించడం, అధికా రాన్ని అడ్డుపెట్టుకొని నిరంకుశత్వంతో ప్రజలను, పత్రిక విలేకరులను ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదు. దీనిపై తక్షణమే ప్రభుత్వం వెనక్కు తగ్గాలి.

–సుజాత, ఐద్వా జిల్లా కార్యదర్శి

అక్రమ కేసులు బనాయించి పోలీసులతో నిర్బంధించడం, జర్నలిస్టుల ఇండ్లలో తనిఖీలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేయడం ఏమాత్రం సరైనది కాదు. అనుకూలమైన వార్తలు రాయాలంటూ బెదిరించడం, మీడియాను తొక్కి పెట్టాలని ప్రయత్నాలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం.

–వనమాల కృష్ణ, సీపీఐ (ఎంఎల్‌)మాస్‌లైన్‌

ప్రజాపంఽథ రాష్ట్ర నాయకులు

నిజాలు రాస్తే వేధింపులా..!1
1/6

నిజాలు రాస్తే వేధింపులా..!

నిజాలు రాస్తే వేధింపులా..!2
2/6

నిజాలు రాస్తే వేధింపులా..!

నిజాలు రాస్తే వేధింపులా..!3
3/6

నిజాలు రాస్తే వేధింపులా..!

నిజాలు రాస్తే వేధింపులా..!4
4/6

నిజాలు రాస్తే వేధింపులా..!

నిజాలు రాస్తే వేధింపులా..!5
5/6

నిజాలు రాస్తే వేధింపులా..!

నిజాలు రాస్తే వేధింపులా..!6
6/6

నిజాలు రాస్తే వేధింపులా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement