
మెజార్టీ అభిప్రాయానికి ప్రాధాన్యత
● డీసీసీ అధ్యక్షుని ఎన్నిపై పార్టీ
జిల్లా పరిశీలకుడు రిజ్వాన్ అర్షద్
● డిచ్‌పల్లిలో రూరల్ బ్లాక్
కాంగ్రెస్ స్థాయి సమావేశం
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్) : మెజార్టీ కార్యకర్తల అభిప్రాయం, కాంగ్రెస్ పార్టీకి విధేయులై అందరినీ కలుపుకొని పోయే వారికే జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష ప దవి దక్కుతుందని పార్టీ జిల్లా పరిశీలకుడు, కర్ణాట క ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ స్పష్టం చేశారు. డీసీసీ అధ్యక్ష ఎన్నికలపై ‘సంఘటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం డిచ్‌పల్లి మండల కేంద్రంలోని కేఎన్‌ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన నిజామాబాద్ రూరల్ బ్లాక్ కాంగ్రెస్ స్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడా రు. కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలని అధినేతలు రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే ఆలోచనల మేర కు డీసీసీ అధ్యక్షుడి నియామకం కోసం గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రతి కార్యకర్త, నాయకుల అభిప్రాయాన్ని సేకరిస్తున్నామని తెలి పారు. పార్టీకోసం ఎళ్లవేళలా కష్టపడే వారు, పార్టీని వీడకుండా 10 సంవత్సరాలకు పైగా క్రియాశీలకంగా పని చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో అధిక ఎంపీలను గెలిపించుకుని రాహల్‌గాంధీని ప్రధానిగా చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.