
పత్రిక స్వేచ్ఛను హరిస్తే ఊరుకోం
సాక్షి ఎడిటర్‌పై అక్రమంగా నమోదు చేసిన కేసులను ఏపీ ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి. ‘సాక్షి’కి కూట మి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. అక్రమాలను వెలికితీస్తున్న ‘సాక్షి’ని అభినందించకుండా, తప్పుడు వార్తల పేరిట యాజమాన్యంపై కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురి చేయడం ప్రజాస్వామ్యంలోనే అవమానకరమైన ఘటన.
–గణేష్, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి
నిజామాబాద్‌అర్బన్: పత్రిక స్వే చ్ఛను హరిస్తే ఊరుకో మని జిల్లాలోని జర్నలిస్టులు, వివిధ సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షి మీడియాపై కూ టమి ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలో వారు నిరసన వ్యక్తం చేశారు. సాక్షి బ్యూరో ఇన్‌చార్జి భద్రరెడ్డి, ఎడిషన్ ఇన్‌చార్జి ప్రభాకర్, అడ్వడైజర్ మేనేజర్ సంపత్, ఆర్సీ ఇన్‌చార్జి, జర్నలిస్టులు పాకాల నర్సింలు, మండే మోహన్, ఏబీవీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ హర్షవర్ధన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ప్రజాస్వామ్య విధానాలను పట్టించుకోకుండా కక్షపూరితమైన పరిపాలన కొనసాగిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని మంటగలిపి ప్రజల హక్కుల్ని కాలరాస్తున్నారు. ప్రజా సమస్యల కోసం ఎప్పుడు ముందుండే ‘సాక్షి’ మీడియాను గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో జరుగుతున్న అక్రమాలను వెలుగు తీస్తే కేసులు పెట్టి నిర్బంధించడం సరైనది కాదు. –జన్నారపు రాజేశ్వర్,
పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి

పత్రిక స్వేచ్ఛను హరిస్తే ఊరుకోం

పత్రిక స్వేచ్ఛను హరిస్తే ఊరుకోం