
నేడు సెపక్‌తక్రా అండర్–14 జట్ల ఎంపికలు
నిజామాబాద్‌నాగారం: కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పోతంగల్ ప్రభుత్వ పాఠశాలలో శనివారం ఎస్‌జీఎఫ్ ఉమ్మడి జిల్లా సెపక్‌తక్రా అండర్–14 బాలబాలికల విభాగంలో జిల్లా జట్ల ఎంపికపోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి నాగమణి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనడానికి జిల్లా జట్టుకు ఎంపికలు చేస్తారన్నారు.
నిజామాబాద్‌నాగారం: కామారెడ్డి జిల్లా దోమకొండలో నేడు ఎస్‌జీఎఫ్ అండర్–14, 17 బాలబాలికల విభాగంలో ఆర్చరీకి ఎంపికలు నిర్వహించనున్నట్లు క్రీడల కార్యదర్శి నాగమణి తెలిపారు. వివరాలకు 94900 15388ను సంప్రదించాలన్నారు.
నిజామాబాద్‌అర్బన్: ఆర్మూర్ ఎస్సై వినయ్ కుమార్‌ను వీఆర్‌కు అటాచ్ చేస్తూ సీపీ సాయిచైతన్య ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. ఇటీవల ఆర్మూర్‌లోని పాత బస్టాండ్‌లో ఓ కిరాణ దుకాణ యజమానిని ఎస్సై వేధించినట్లు ఓ వీడియో వైరల్ అయింది. ఈ విషయం సీపీ దృష్టికి రావడంతో ఎస్సైను వీఆర్‌కు అటాచ్ చేసినట్లు సమచారం.
బీసీ బంద్‌కు కాంగ్రెస్ మద్దతు
నిజామాబాద్ సిటీ: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ బీసీ సంఘాలు ఇచ్చిన రాష్ట్ర బంద్‌కు జిల్లా కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార సంఘాల సొసైటీ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ బీసీ బంద్‌లో పాల్గొనాలని సూచించారు. కాంగ్రెస్ బీసీ పక్షాన నిలబడుతోందన్నారు. బంద్ సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం రద్దుచేసినట్లు తెలిపారు.
సీఎంకు కృతజ్ఞతలు..
జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి మానాల మోహన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి పెద్దపీఠ వేస్తున్న సీఎంకు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు.