
ఒమన్‌లో చిక్కుకున్న సిద్దపల్లి వాసి
మోర్తాడ్(బాల్కొండ): గల్ఫ్ దేశం ఒమన్‌లో చిక్కుకున్న తన తండ్రిని స్వగ్రామానికి రప్పించాలని కూతురు కోరింది. ఈమేరకు హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన ప్ర వాసీ ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. వివరా లు ఇలా.. భీమ్‌గల్ మండలం సిద్ధపల్లికి చెందిన భోజ సురేష్‌ను ధర్పల్లికి చెందిన ఏజెంట్ ఒకరు ఆ గష్టులో ఒమన్‌కు పంపించాడు. అక్కడ ఒక కార్యాలయంలో క్లీనింగ్ విభాగంలో పని కల్పిస్తానని నమ్మించి, సురేష్ వద్ద రూ.90వేలు తీసుకున్నాడు. తీరా ఒమాన్ వెళ్లిన తర్వాత యాంకూల్ పట్టణానికి సమీపంలోని ఒక గ్రామంలోని వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. అక్కడ ఉన్న గొర్రెల మందకు కాపరిగా పని చేయాలని సూచించారు. తనకు చెప్పి న పని కాకుండా, ఎడారిలో గొర్రెలకు కాపలాగా ఉండటంతో అతడు నిత్యం చాలా ఇబ్బంది పడుతున్నాడు. తాను ఇక్కడ ఉండలేనని సురేష్ తన కుటుంబ సభ్యులతో గోడు వెళ్లబోసుకున్నాడు. ఇటీవల సురేష్ తల్లి చనిపోగా, అతని భార్య అనారోగ్యంతో బాధపడుతుంది. దీంతో తన తండ్రిని ఎలాగైనా ఇంటికి రప్పించాలని కోరుతూ బాధితుడి కూతురు తేజశ్రీ ప్రవాసీ ప్రజావాణిలో అధికారి జగదీష్ పటేల్‌కు, ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రధాన కార్యదర్శి సురేంద్రనాథ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి ‘సాక్షి’తో మాట్లాడారు. ఏజెంట్ చేతిలో మోసపోయిన సురేష్‌కు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.
క్లీనింగ్ విభాగంలో ఉపాధి
అంటూ గొర్రెల కాపరిగా
పనికి పురమాయించిన ఏజెంట్
ఎడారిలో తీవ్ర ఇబ్బందులు
పడుతున్న వైనం
తన తండ్రిని ఇంటికి రప్పించాలని ప్రవాసి ప్రజావాణిలో కూతురి వేడుకోలు

ఒమన్‌లో చిక్కుకున్న సిద్దపల్లి వాసి