
కాంటాలు ఇంకెప్పుడో..
కొనుగోలు కేంద్రాల వివరాలు
నందిపేట్(ఆర్మూర్) : జిల్లాలో వరికోతలు ప్రారంభమై నెలరోజులవుతోంది. అధికారులు వివిధ ప్రాంతాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా.. ఇప్పటి వరకు కొనుగోలు మాత్రం చేయడం లేదు. కోత కోసిన ధాన్యాన్ని చాలా గ్రామాల్లో రైతులు కొనుగోలు కేంద్రాల వద్దకు తరలించి ఆరబెడుతున్నారు. ఇలా ఆయా గ్రామాల్లో ధాన్యం రాశులు కుప్పలు తెప్పలుగా పేరుకు పోతున్నాయి. మరోవైపు ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించడంతో వరి కొనుగోళ్లు ఎప్పుడెప్పుడా అని రైతులు ఎదురు చూస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా 4,36,695 ఎకరాలలో వరి సాగు చేశారు. జిల్లాలో 677 కొనుగోలు కేంద్రాల ద్వారా 8.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పాటికే సగం వరకు కేంద్రాలను పీఏసీఎస్, ఐకేపీ, మోప్మా, ఐసీడీఎంఎస్, ఎఫ్‌డీవో ల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
నామ మాత్రంగా ప్రారంభమైన
కొనుగోలు కేంద్రాలు
నెల నుంచి సాగుతున్న వరికోతలు
ధాన్యం తరలించి కేంద్రాల వద్ద
రైతుల పడిగాపులు
మరోవైపు వెంటాడుతున్న
వరుణుడి భయం

కాంటాలు ఇంకెప్పుడో..