
విద్యార్థుల సంక్షేమంపై దృష్టి పెట్టండి
నిజామాబాద్‌అర్బన్ : బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి ని కేంద్రీకరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక ప్రణాళిక, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర సాంఘిక, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిజామాబా ద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సంక్షేమ శాఖల అ ధికారులు ఈ వీసీలో పాల్గొన్నారు. ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కూ ల్స్ స్కీం కింద ఎంపిక చేసిన పాఠశాలలో చదివే షె డ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన విద్యా ర్థుల సంక్షేమంపై ఆయా జిల్లాల కలెక్టర్లు నిరంత రం పర్యవేక్షించాలన్నారు. విద్యార్థులకు అందిస్తు న్న బోధన, ఆరోగ్యం, మెనూ ప్రకారం భోజనం, ఇతర మౌలిక వసతుల అమలుపై పాఠశాలలను సందర్శించి పరిశీలించాలన్నారు. ఎంపికైన ప్రతి వి ద్యార్థి పాఠశాలలో ఉండాలని, సమస్యల పరిష్కారంపై ఆయా పాఠశాలల యాజమాన్యాలతో చర్చించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థు లకు ఎలాంటి ఆటంకం లేకుండా విద్యాబోధన కొ నసాగేలా చూడాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జి ల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకు లు రజిత, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నాగురా వు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అ ధికారి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
‘బెస్ట్ అవైలబుల్ స్కూల్స్’ను
సమీక్షించండి
వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్,
అధికారులతో డిప్యూటీ సీఎం
భట్టి విక్రమార్క