
మార్కెట్‌యార్డు అభివృద్ధికి సమష్టి కృషి
● రూ.3 కోట్లతో కవర్‌షెడ్,
టాయిలెట్ల నిర్మాణం
● నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్
ముప్ప గంగారెడ్డి
సుభాష్‌నగర్ : నిజామాబాద్ మార్కెట్ యార్డు అభివృద్ధికి మంత్రి, జిల్లా ఎమ్మెల్యేల సహకారంతో అధి కారులు, పాలకవర్గం సమష్టిగా కృషి చేస్తోందని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగా రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని వ్యవ సాయ మార్కెట్ కార్యాలయంలో పాలకవర్గ సాధా రణ సమావేశం జరిగింది. చైర్మన్ గంగారెడ్డి మాట్లా డుతూ మార్కెట్‌యార్డులో కవర్ షెడ్, కూరగాయల మార్కెట్‌లో రెండు టాయిలెట్స్ బ్లాకుల నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. రూ.97 లక్షలతో గాంధీగంజ్‌లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. కూరగాయల మార్కెట్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. మార్కెట్‌లో కవర్ షెడ్, సీసీ కెమెరాల పునరుద్ధరణ, నూతనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు, అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపించాలని పాలకవర్గం తీర్మానించింది. వైస్ చైర్మన్ రాంచంద ర్ మాట్లాడుతూ చైర్మన్, పాలకవర్గ సభ్యుల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. సమావేశంలో సెల క్షన్ గ్రేడ్ సెక్రటరీ అపర్ణ, గ్రేడ్–1 సెక్రటరీ విజయ్‌కి షోర్, డైరెక్టర్లు మారుతీ మల్లేష్, గంగారెడ్డి, రాజలింగం,బాగారెడ్డి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.