
బస్సు, కారు ఢీ
● ఒకరికి తీవ్రగాయాలు
కమ్మర్‌పల్లి: మండల కేంద్రంలోని లలిత ఆశ్ర మం దగ్గర జాతీయ రహదారిపై బుధవారం ఆర్టీసీ బస్సు, కారును ఢీ కొట్టిన ఘటనలో ఒ కరికి తీవ్రగాయాలయ్యాయి. జగిత్యాల జి ల్లా మెట్‌పల్లి మండలం రాజేశ్వరరావుపేట గ్రామానికి చెందిన దుంపల సాయికుమార్ మారుతి స్విఫ్ట్ డిజైర్ కారులో మోర్తాడ్ నుంచి రాజేశ్వరరావుపేటకు వెళ్తున్నాడు. కమ్మర్‌పల్లి పరిధిలోని లలిత ఆశ్రమం దగ్గర ఎదురుగా వస్తున్న కరీంనగర్ డిపో–2కు చెందిన ఆర్టీసీ బస్సు సాయికుమార్ కారును ఢీకొట్టింది. కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, సాయికుమార్ కుడి చేయికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపారు.
● ఒకరికి తీవ్రగాయాలు
మాక్లూర్: బైక్‌ను వెనుక నుంచి ఇటుక టిప్పర్ ఢీకొన్న ఘటన లో ఒకరికి తీవ్రగాయాలయ్యా యి. స్థానికుల కథనం ప్రకారం..మండలంలోని ధర్మోర గ్రా మానికి చెందిన కల్లెం నడ్పి సాయిలు బుధవారం ద్విచ క్ర వాహనంపై నవీపేట మండలం కమలాపూర్ వె ళ్లి తిరిగి వస్తున్నాడు. మెట్‌పల్లి, వల్లభాపూర్ గ్రా మాల మధ్యలో వెనుక నుండి వస్తున్న మినీ టిప్పర్ బలంగా ఢీకొట్టింది. దీంతో కల్లెం నడ్పి సాయిలు కాలు విరిగింది. గమనించిన వాహనదారులు క్షతగాత్రుడిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.

బస్సు, కారు ఢీ