
ప్రముఖుల విజయ దశమి శుభాకాంక్షలు
ఖలీల్‌వాడి: జిల్లా ప్రజలకు విజయదశమి పండుగ సందర్భంగా సీపీ పోతరాజు సాయిచైతన్య శుభాకాంక్షలు తెలిపారు. దుష్ట శక్తులపై విజయానికి సంకేతంగా జరుపుకునే ఈ పండుగను స్ఫూర్తిగా తీసుకొని ప్రజలందరూ ఐక్యత, సమగ్రతల కోసం కృషి చేయా లని పేర్కొన్నారు. కుటుంబసభ్యులతో నిండు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో కాలం గడపాలన్నారు. నిజామాబాద్, ఆర్మూ ర్, బోధన్ డివిజన్ పరిధిలలో శాంతి భద్రతలకు, మత విధ్వంసాలకు తావులేకుండా అందరూ సహకరించాలని కోరారు. ఎల్లప్పుడు ప్రజలు, పోలీస్ సిబ్బంది స్నేహ పూర్వకంగా సోదర స్వభావంతో మెలగాలని సూచించారు.
వేల్పూర్: జిల్లా, బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో విజయదశమి (దసరా)శుభాకాంక్షలు తెలిపారు. విజయానికి ప్రతీకగా, అన్యాయంపై గెలుపునకు సంకేతంగా విజయదశమి జరుపుకుంటామన్నారు. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలని, కుటుంబాల్లో ఆనందాలు, సుఖశాంతులు వెల్లివిరియాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.