
గాంధీ జయంతి నాడే దసరా
● మాంసం విక్రయించొద్దని మున్సిపల్ అధికారుల నోటీసులు
● బెల్టుషాపులలో మద్యం స్టాక్ ఫుల్
బిచ్కుంద(జుక్కల్): ఉద్యోగ, ఉపాధి, వ్యాపారం నిమిత్తం పట్టణాలకు వెళ్లిన వారు దసరా పండుగకు స్వగ్రామాలకు చేరుకున్నారు. బంధుమిత్రులతో కలిసి ఆనందోత్సాహాలతో వేడుకలను జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. వాహనాలు, యంత్రాలకు పూజలు చేసి మాంసంతో వంటకాలు, మిత్రులతో కలిసి మద్యం సేవించడం ఏటా ఆనవాయితీగా వస్తోంది. కాగా, ఈసారి గాంధీ జయంతి రోజునే దసరా పండుగ వచ్చింది. దీంతో జీవహింస చేయొద్దని, మద్యం దుకాణాలను మూసి ఉంచాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. అయితే, పండుగ రోజు కూడా మద్యం, మాంసం ముక్క లేకుంటే ఎలా అంటూ ప్రజల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
మాంసం దుకాణాలకు నోటీసులు
ఈ నెల 2న గురువారం గాంధీ జయంతి సందర్భంగా మేకలు, కోళ్లు జీవహింస చేయవద్దని బుధవారం మున్సిపల్ అధికారులు మాంసం విక్రయ దుకాణదారులు, హోటళ్లకు నోటీసులు అందజేశారు. హోటళ్లలో సైతం మాంసం కూర వండరాదన్నారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
బెల్టుషాపులలో స్టాక్...
గాంధీ జయంతి రోజున మద్యం విక్రయాలపై గ్రా మాలలో అంతగా పట్టింపు ఉండదనే ఉద్దేశంతో బె ల్టుషాపుల నిర్వాహకులు మద్యం బాటిళ్లను నిల్వచే సి పెట్టారు. పట్ణణ, మండల కేంద్రాల నుంచి బెల్టుషాపులకు వచ్చి కొనుగోలు చేస్తారనే ఉద్దేశంతో బ్రాండెడ్ మద్యాన్ని తెచ్చిపెట్టినట్లు తెలిసింది. వైన్స్ లు బంద్ ఉండడంతో అధిక ధరలకు విక్రయించి లాభం పొందవచ్చని నిర్వాహకులు భావిస్తున్నారు.

గాంధీ జయంతి నాడే దసరా