
రిజర్వేషన్లు మారేనా?
న్యూస్‌రీల్
నిజామాబాద్
● రెండేళ్లలో ఉత్తీర్ణత కావాలన్న
సుప్రీం కోర్టు
● లేదంటే సర్వీస్ నుంచి తొలగింపు
● ఆందోళన చెందుతున్న టీచర్లు
అధిక వర్షాలతో పరేషాన్..
అధిక వర్షాలు రైతులను పరేషాన్ చేస్తున్నాయి. భూగర్భ జలాలు అధికమై
పంట భూముల్లో నీరు ఉబికి వస్తోంది.
బుధవారం శ్రీ 1 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
– 10లో u
వాతావరణ పరిస్థితుల మేరకు వరికోతలు చేపట్టాలి
బోధన్: వాతావరణ పరిస్థితుల మేరకు వరి కోతలను ప్రారంభించాలని జిల్లా వ్యవసా య శాఖ అఽధికారి గోవింద్ రైతులకు సూచించారు. ఎడపల్లి మండలంలోని జైతాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాములో ఎరువుల నిల్వలను డీఏవో మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదని స్పష్టం చేశారు. వచ్చే యాసంగి సీజన్‌లో పంటల సాగుకు నానో యూరియా వాడాలని, దిగుబడి పెరు గుతుందని రైతులకు సూచించారు. ఆయన వెంట ఏవో సిద్ధి రామేశ్వర్, ఏఈవో శ్రీహరి, సొసైటీ సిబ్బంది ఉన్నారు.
● రెండురోజుల పాటు నగరంలోనే..
● దసరా ఉత్సవాల్లో పాల్గొననున్న
మహేశ్ కుమార్‌గౌడ్
నిజామాబాద్ సిటీ: పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ బుధవారం నగరంలో పర్యటించనున్న ట్లు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విఫుల్ గౌడ్ తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్, నుడా ఫండ్ నుంచి కేటాయించిన నిధులతో నిర్మించనున్న సీసీ డ్రైన్‌లు, సీసీ రోడ్లు, స్ట్రామ్‌వాటర్ డ్రైన్స్ పనులను ప్రారంభిస్తారు. అమ్మనగర్ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. కంఠేశ్వర్ ఆలయ పాలకమండలి కార్యక్రమంలో పాల్గొననున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో కార్యకర్తలు, పార్టీ నాయకులకు అందుబాటులో ఉండనున్నట్లు విఫుల్‌గౌడ్ తెలిపారు. గురువారం జరిగే దసరా పండుగ వేడుకలో సైతం పీసీసీ చీఫ్ పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.
వైన్‌షాపులకు
ఏడు దరఖాస్తులు
ఖలీల్‌వాడి: జిల్లాలోని వైన్‌షాపులను లక్కీ డ్రా ద్వారా కేటాయించేందుకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోందని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డి తెలిపారు. మంగళవారం ఏడు దరఖాస్తులు అందాయన్నారు. నిజామాబాద్, ఆర్మూర్, మో ర్తాడ్ ఎక్సైజ్ స్టేషన్‌ల ఫరిధిలో రెండు చొ ప్పున, భీమ్‌గల్ స్టేషన్ పరిధిలో ఒక దరఖా స్తు అందిందని వివరించారు. ఇప్పటి వరకు మొత్తం 9 దరఖాస్తులు అందాయన్నారు.
చెత్త వేరుచేసే ప్రక్రియను వేగవంతం చేయాలి
నిజామాబాద్ సిటీ: చెత్తను వేరే చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ మసూద్ సూచించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాగారంలో ఉన్న డంపింగ్‌యార్డును మంగళవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. డంపింగ్‌యార్డు ఇన్‌చార్జి ప్రభుదాస్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆయనవెంట డిప్యూటీ కమిషనర్ డీఈ ముస్తాక్ అహ్మద్, శానిటరీ సూపర్‌వైజర్ సాజిద్ అలీ తదితరులున్నారు.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: స్థానిక సంస్థల రిజర్వేషన్లు.. షెడ్యూల్ విడుదల.. హైకోర్టులో కేసు.. సుప్రీం కోర్టుకు సైతం కేసు వెళ్లనుందనే వార్తల నేపథ్యంలో రిజర్వేషన్లు మారుతాయా? అనే చర్చ అన్ని పార్టీల శ్రేణుల్లో సాగుతోంది. ఎక్కడ చూసినా.. ఏ ఇద్దరు కలిసినా.. ఫోన్లలో మాట్లాడుకున్నా ఇవే సంభాషణలు జరుగుతున్నాయి. ఇక పోటీ చే యాలనుకుంటున్న వారిలో ఈ అంశం ఉత్కంఠను రేపుతోంది. వ్యవహారం హైకోర్టులో ఉండడం, దీ నిపై ఈ నెల 8న వాదనలు జరుగనున్న నేపథ్యంలో ప్రతిఒక్కరిలో ఆసక్తి నెలకొంది. పైగా కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయో అనే విషయమై ఆశావహుల్లో ఆందోళన నెలకొనగా.. మరోవైపు మరుసటి రోజు నుంచే ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలు పెట్టేందుకు యంత్రాంగం సిద్ధం అయ్యింది.
దీంతో పరిణామాలు ఎలా మారుతాయోనని ముఖ్యంగా ఎన్నికల బరిలో నిలవాలనుకుంటున్న ఆశావహులు పరేషాన్ అవుతున్నారు. ఇదిలా ఉండగా డబ్బులు ఖర్చు చేయక తప్పని పరిస్థితి నెలకొనడంతో గందరగోళానికి గురవుతున్నారు. ఇక హైకోర్టు తీర్పును బట్టి సుప్రీం కోర్టుకు సైతం వెళ్లే అవకాశాలు ఉన్నాయని కొందరు అధికార పార్టీ నాయకులే మాట్లాడుతుండడం గమనార్హం.
ఈటల వ్యాఖ్యలతో..
మహారాష్ట్రలో గతంలో స్థానిక ఎన్నికలు జరిగిన త రువాత సైతం కోర్టు రద్దు చేసిందంటూ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తాజా షెడ్యూల్, కోర్టు తీర్పు ఎలా వస్తుందోననే చర్చ జరుగుతోంది. మొదటి విడత నామినేషన్ల గడువు సమీపిస్తుండడం, ముందురోజే కోర్టు లో వాదనలు ఉన్నందున వ్యవహారం ఎలాంటి మ లుపులు తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది. దీంతో డబ్బులు ఖర్చు చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని ఆయా పార్టీల నాయకులు, బరి లో నిలిచేందుకు సిద్ధమైనవారు నిర్ణయించుకున్నా రు. అయినప్పటికీ దసరా దావత్‌లు, అనుచరుల కోసం ఖర్చు చేయక తప్పని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. మొత్తంమీద షెడ్యూల్ వచ్చినప్పటికీ బంతి హైకోర్టులో ఉన్నందున ఎన్నికల వాతావరణంలో గతానికి భిన్నమైన ప్రత్యేకత నెలకొంది.
పరిషత్, సర్పంచ్ స్థానాలకు పోటీ
చేయాలనుకుంటున్న వారిలో ఇదే చర్చ
బంతి హైకోర్టులో ఉండడంతో
ఏమవుతుందోననే ఉత్కంఠ
8న కోర్టులో వాదనలు.. 9న పరిషత్ తొలివిడత నామినేషన్ల ప్రక్రియ
కావడంతో ఆశావహుల్లో ఆందోళన
మరోవైపు పార్టీ కోసం ఏళ్లతరబడి
కష్టపడితే అవకాశాలు దక్కలేదంటున్న
అధికార పార్టీ నాయకులు
సుప్రీంకు సైతం కేసు వెళ్తుందంటున్న
నేపథ్యంలో తర్జన భర్జనలు
అధికార పార్టీ నేతల్లో నిరాశ
స్థానిక సంస్థల రిజర్వేషన్ల అంశం హైకోర్టులో ఉన్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లలో అనుకూలంగా ఉన్న స్థానాలు ఎక్కడ మారుతాయోనని పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్లపై హై కోర్టులో ఈ నెల 8న వాదనలు ఉండగా, మరుసటి రోజు నుంచే ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. అధికార యంత్రాంగం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను మొదలు పెట్టేందుకు అంతా సిద్ధం చేసుకుంది.
ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసి, గత పదేళ్లలో ప లు కేసులు ఎదుర్కొన్నప్పటికీ తమకు పోటీ చేసే అవకాశాలు దక్కలేదని పలువురు అధికార పార్టీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. ఎంపీపీ స్థా నం దక్కించుకునే అవకాశం ఉన్నప్పటికీ ఎంపీటీ సీ స్థానంలో పోటీ చేసేందుకు అనుకూలంగా రిజర్వేషన్లు దక్కకపోవడంతో ఆయా మండలాల కీలక నాయకులు నిట్టూరుస్తున్నారు. ఎంపీటీసీ స్థానం అనుకూలంగా వచ్చినప్పటికీ ఎంపీపీ పీ ఠంపై కూర్చునేందుకు అవకాశాలు లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కీలక బీసీ నేత జెడ్పీ చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. జె డ్పీటీసీ అనుకూలంగా వచ్చినప్పటికీ చైర్మన్ పీ ఠం బీసీ మహిళకు కేటాయించడంతో నిరాశ చెందుతున్నారు. అదేవిధంగా జెడ్పీ పీఠం ఆశించిన పలువురు ముఖ్య నేతలు సైతం అవకాశాన్ని కో ల్పోయామని మదన పడుతున్నారు. కాంగ్రెస్, బీ జేపీ, బీఆర్‌ఎస్‌లకు చెందిన పలువురు నాయకు లు తమ భార్యలను బరిలోకి దించే అవకాశాలు ఉన్నప్పటికీ అంతగా ఆసక్తి చూపడం లేదు. ఆచి తూచి అడుగేసేందుకే మొగ్గు చూపుతున్నారు.

రిజర్వేషన్లు మారేనా?

రిజర్వేషన్లు మారేనా?