
ఈనెల 5 నుంచి ధాన్యం సేకరణ
నిజామాబాద్ అర్బన్: కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చి ఈనెల 5వ తేదీ నుంచి ధాన్యం సేకరణ సజావుగా సాగేలా అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. సమీకత జిల్లా కార్యాలయాల సముదాయ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముందస్తుగా నాట్లు పూర్తి చేసిన ప్రాంతాల్లో పంట దిగుబడి వస్తున్న దృష్ట్యా కొనుగోలు కేంద్రాలు రైతులకు అందుబాటులోకి తెచ్చేలా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో ధా న్యం సేకరణ కేంద్రాలు అందుబాటులో ఉండే వి ధంగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అన్నా రు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, అవసరమైన అన్నిమౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. తేమ కొలిచే యంత్రాలు, టార్పాలిన్లు, తూకం యంత్రాలతోపాటు హమాలీలను అందుబాటులో ఉంచాలన్నారు. నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం తీసుకువచ్చే రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తి స్థాయి మద్దతు ధర అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. సంబంధిత శాఖల అధికారులందరూ సమష్టిగా, సమన్వయంతో ప నిచేస్తూ ధాన్యం సేకరణ ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఎస్‌వో అరవింద్‌రెడ్డి, సివిల్ సప్లయీస్ డీఎం శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివా స్, జిల్లా వ్యవసాయ అధికారి జె గోవిందు, మార్కెటింగ్ శాఖ ఏడీ గంగుబాయి పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో మౌలిక
సదుపాయాలు కల్పించాలి
అధికారులు సమన్వయంతో
పని చేయాలి
కలెక్టర్ టి వినయ్‌కృష్ణారెడ్డి