
ఇన్ ఫ్లో 720 టీఎంసీలు..
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఈ ఏడాది ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 720 టీఎంసీల వరద వచ్చి చేరింది. 1983లో 1165 టీఎంసీలు, ఆ తరువాత 1988లో 912.95 టీఎంసీల ఇన్ ఫ్లో వ చ్చింది. ఈ ఏడాది వచ్చిన వరద మూడో అతిపెద్ద ఇన్‌ఫ్లోగా ప్రాజెక్టు చరిత్రలో నిలిచింది. సెప్టెంబర్‌లోనే 400 టీఎంసీల ఇన్‌ఫ్లో రాగా, ఇప్పటికీ ఎ గువ నుంచి వరద కొనసాగుతూనే ఉంది. 3.8 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఎగువన మహారాష్ట్రలో ఉన్న బా బ్లీగేట్లను అక్టోబర్ 28వ తేదీన మూసివేస్తే వరదకు బ్రేక్ పడుతుంది. ఈ లెక్కన మరో 27 రోజులపాటు వరద వస్తుంది. ఈనెలలో సైతం భారీ ఇన్‌ఫ్లో కొనసాగితే పాతరికార్డును సైతం తిరగరాసే అవకాశం ఉంది.
660 టీఎంసీల అవుట్ ఫ్లో
ప్రాజెక్ట్ నుంచి ప్రస్తుత సంవత్సరం 660 టీఎంసీల నీటిని వరద గేట్లు, కాలువల ద్వారా ఇప్పటి వరకు విడుదల చేశారు. అందులో 570 టీఎంసీల నీరు గోదావరికిలోకి వెళ్లింది. అంటే ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం కన్నా 5 రెట్ల నీరు గోదావరికి వెళ్లిపోయింది.
● ఎస్సారెస్పీ చరిత్రలో మూడోసారి
రికార్డు స్థాయి వరద!
● 1983, 1988 తరువాత ఇదే అత్యధికం
● ఇప్పటికీ కొనసాగుతున్న ఇన్‌ఫ్లో