
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పేరిణి నాట్య ప్రదర్శన
బోధన్: తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కొనసాగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహోత్సవాల్లో సోమవారం సాయంత్రం జిల్లాకు చెందిన ధనిత్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో పేరిణి సతీశ్ బృందం నాట్య ప్రదర్శన ఇచ్చారు. జిల్లా కేంద్రానికి చెందిన నాట్య గురువు ఆధ్వర్యంలో 25 మంది కళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. నీల, యశశ్రీ, హర్షిత, లక్ష్మీవైష్ణవి, లక్ష్మి, సుమీష, త్రిశాల, హాసిని, బీ.హర్షిత, సాయిశ్రద్ధ తదితరులు పేరిణి నాట్యాన్ని ప్రదర్శించారు. బ్రహోత్సవాల్లో భాగంగా టీటీడీ సంగీత కళాశాల ఆధ్వర్యంలో 10 రాష్ట్రాల నుంచి 463 మంది నృత్య కళాకారులతో కూడిన 21 బృందాలు పాల్గొనగా, అందులో జిల్లాకు చెందిన పేరిణి నాట్య బృందం ఒకటి. ఈ సందర్భంగా నాట్య గురువు సతీశ్ మాట్లాడుతూ ఈ అవకాశం దక్కడం గొప్ప గౌరవమని, కళాకారులందరూ సమన్వయంతో ప్రదర్శనను విజయవంతం చేశారని హర్షం వ్యక్తంచేశారు.