● కోడ్‌ను పక్కాగా అమలు చేయాలి
● అధికారులతో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్‌అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో ఎంపీడీవోలు, ఎంపీవోలతో కలెక్టర్ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలక్షన్ కోడ్ పక్కాగా అమలయ్యేలా చూడాలని, నియమ, నిబంధనలపై పూ ర్తి అవగాహన కలిగి ఉండి విధులను జాగ్రత్తగా ని ర్వర్తించాలని అన్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన హోర్డింగులు, పోస్టర్లతోపాటు ప్రభుత్వ కా ర్యాలయాలు, సంస్థల గోడలపై ఏవైనా రాతలు ఉంటే తొలగించాలని ఆదేశించారు. ఓటర్లను ప్రలో భాలకు గురిచేసే చర్యలపై నిఘా ఉంచాలన్నారు. ఓటరు జాబితాను మరోమారు నిశితంగా పరిశీలించాలని, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లు గమనిస్తే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు కోసం రెవెన్యూ డివిజన్ కేంద్రాల వారీగా కౌంటింగ్ హాళ్లను గుర్తించాలన్నారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మా ల్వియ, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మా వి, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, ఆర్డీవో రాజేంద్రకుమార్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, నోడల్ అధికారులు, డీఎల్‌పీవోలు పాల్గొన్నారు.
రాజకీయ పార్టీలు సహకరించాలి
ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందు కు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి కోరారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ మంగళవారం సమావేశమైన కలెక్టర్ ఎన్నికల నిర్వహణ అంశాలపై మాట్లాడారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకారం అందించాలని కోరారు.