
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
మాక్లూర్: అడ్డుగా వచ్చిన గేదెలను తప్పించబోయి ఓ యువకుడు బైక్‌పై నుంచి కిందపడి మృతి చెందిన ఘటన మండలంలోని మాదాపూర్‌లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ కథనం మేరకు... నందిపేట మండలం వెల్మల్ గ్రామానికి చెందిన మద్దెపల్లి మోహన్ (44) ద్విచక్ర వాహనంపై రాత్రి 7 గంటలకు పని నిమిత్తం నిజామాబాద్ వెళుతున్నాడు. మాదాపూర్ గ్రామం వద్ద పాడి గేదెలను తప్పించబోయి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. తలకు బలమైన గాయాలు కావటంతో మోహన్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
● చిన్నారి పరిస్థితి విషమం
ఆర్మూర్ టౌన్: ఆర్మూర్ పట్టణంలోని రాజారాంనగర్ శివారు ప్రాంతం, వెంకటేశ్వర కాలనీ, ఔటిగల్లీల్లో పిచ్చికుక్కల స్వైరవిహారం చేశాయి. మంగళవారం సుమారు 17 మందిపై దాడి చేశాయి. క్షతగాత్రులకు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యులు చికిత్స నిర్వహించారు. కాగా, ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.
మాక్లూర్ : మండలంలోని కొత్తపల్లి శివారులో ఉన్న ఓ మామిడి తోటలో పేకాట స్థావరంపై మంగళవారం సాయంత్రం ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది దాడి చేశారు. పేకాడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకొని రూ.4,620 నగదు, 4 ద్విచక్ర వాహనాలు, 5 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.