
ఉద్యోగులకు విరమణ తప్పదు
ఖలీల్‌వాడి: ఉద్యోగులకు పదవీ విరమణ తప్పదని, ఎలాంటి రిమార్క్ లేకుండా పనిచేయడం గొప్ప విషయమని సీపీ పోతరాజు సాయిచైతన్య పేర్కొన్నారు. జిల్లా పోలీస్ శాఖలో పదవీ విరమణ చేసిన ఎస్సైలు బాబూరావు, ఎండీ నసీరుద్దీన్, సీపీ ఆఫీస్ సూపరింటెండెంట్ వనజా రాణిలను మంగళవారం సీపీ ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులకు ఎలాంటి అవసరం ఉన్నా పోలీస్ శాఖ అందుబాటులో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) బస్వారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీశైలం, వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి, రూరల్ ఎస్సై ఎండీ ఆరీఫ్, రిజర్వ్ సీఐ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.