
పోలీస్ పరేడ్ రగ్రౌండ్‌లో చండీయాగం
● హాజరైన కలెక్టర్, సీపీ
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన దుర్గా పరమేశ్వరీ మాత మందిరంలో మంగళవారం మహా చండీయాగం నిర్వహించారు. యాగానికి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ పోతరాజు సాయిచైతన్యలు సతీమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు బస్వారెడ్డి, రామచంద్రరావు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, ఆర్మూర్, బోధన్ సబ్ కలెక్టర్లు అభిజ్ఞాన్ మాల్వీయ, వికాస్ మహతో, డీఎంహెచ్‌వో రాజశ్రీ, ట్రెయినీ కలెక్టర్, ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.