ఉపాధ్యాయుల్లో టెట్‌ గుబులు | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల్లో టెట్‌ గుబులు

Oct 1 2025 11:09 AM | Updated on Oct 1 2025 11:11 AM

నిజామాబాద్‌అర్బన్‌: ప్రభుత్వ ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్‌ (టీచర్స్‌ ఎలిజిబిలిటి టెస్ట్‌) ఉత్తర్ణత కావాల్సిందేనని సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు వెలువరించడంతో టీచర్లు ఆందోళన చెందుతున్నా రు. ప్రభుత్వం వెంటనే దీనిపై రిట్‌ పిటిషన్‌ వేయా లని గత కొన్ని రోజులుగా డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే 2010కి ముందు నియమితులైన టీచర్లందరూ రెండేళ్లలో టెట్‌ అర్హత సాధించాలని సుప్రీం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం 2012, 2017, 2024లో చేపట్టిన డీఎస్సీ నియామకాల్లో టెట్‌ను అమలు చేసింది.

ఎలా సాధ్యమంటున్న టీచర్లు

టెట్‌ మార్గదర్శకాలు తమకు వర్తించవని, సుప్రీం కోర్టు తీర్పు రూల్స్‌కు విరుద్ధమని విద్యా హక్కు చ ట్టం రాకముందు వివిధ నోటిఫికేషన్ల ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు అంటున్నారు. ఇది ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రిట్‌ పిటిషన్‌ వేయాలని డిమాండ్‌ చేస్తు న్నారు. ప్రస్తుతం కొందరు నిరుద్యోగులే ఒకటి కంటే ఎక్కువసార్లు రాస్తేనే ఉత్తీర్ణత సాధిస్తున్నారని, అలాంటిది 10 నుంచి 15 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తి కొనసాగుతున్న వారు టెట్‌ ఎలా పాస్‌ అవుతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాహక్కు చట్టానికి ముందే ఉపాధ్యాయ వృత్తిలో చేరిన వారికి టెట్‌ మినహాయింపు ఇవ్వాలని, పదోన్నతులు పొందే వారికి టెట్‌ అమలు చేయాల ని ఉపాధ్యాయ సంఘాలు నాయకులు కోరుతున్నారు. విద్యా హక్కు చట్టంలో సవరణ చేయాలంటున్నారు. అయితే చట్ట సవరణ అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉండగా, అనేక రాష్ట్రాలు సుప్రీంలో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశాయి.

పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఎన్‌హెచ్‌ –44

పాఠశాలలు 1176.. టీచర్లు 4576..

జిల్లాలో 1176 పాఠశాలలు, 4576 మంది టీ చర్లు ఉన్నారు. ఇందులో టెట్‌ ఉత్తీర్ణత లేని వా రు 1671 మంది ఉన్నారు. విద్య హక్కు చట్టం సెక్షన్‌ 23(1) ప్రకారం 1 నుంచి 8 తరగతుల కు బోధించే ఉపాధ్యాయులకు టెట్‌ తప్పని సరి చేస్తూ ఎన్‌సీటీఈ (నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌) 2010 ఆగస్టు 23న నోటిఫికేషన్‌ విడుదల చేసింది.అనంతరం 2014 న వంబర్‌ 12న పైస్థాయి పదోన్నతుల కోసం టె ట్‌ తప్పనిసరి చేస్తూ ఎన్‌సీటీఈ మరో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. చాలా రాష్ట్రాల్లో టెట్‌ ఉత్తీర్ణత కాకుండా పదోన్నతులు ఇస్తుండడంతో కొందరు ఉపాధ్యాయులు కోర్టులో పిటిష న్‌ వేశారు. దీంతో టెట్‌ తప్పనసరి అంటూ కో ర్టు పేర్కొంది. రానున్న రెండేళ్లలో టెట్‌ పాస్‌ కాకుంటే వెంటనే సర్వీస్‌ నుంచి తొలగించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

మినహాయింపు ఇవ్వాలి

2010కి ముందు ఉద్యోగంలో ప్రవేశించిన ఉపాధ్యాయుల ను ఉద్యోగంలో కొనసాగించేందుకు మానవతా దృక్పథంతో టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని సవరించాలి.

– జి శ్రీనివాస్‌, పీఆర్టీయూ రాష్ట్ర

అసోసియేట్‌ అధ్యక్షుడు

రిట్‌ పిటిషన్‌ వేయాలి

సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రిట్‌ పిటిషన్‌ వేయాలి. స్టే ఆర్డర్‌ తీసుకువస్తే బాగుంటుంది. 2010 కి ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి. – సురేశ్‌, గెజిటెడ్‌

హెచ్‌ఎంల సంఘం రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు

ఉపాధ్యాయుల్లో టెట్‌ గుబులు 1
1/2

ఉపాధ్యాయుల్లో టెట్‌ గుబులు

ఉపాధ్యాయుల్లో టెట్‌ గుబులు 2
2/2

ఉపాధ్యాయుల్లో టెట్‌ గుబులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement