
వన్య ప్రాణుల రక్షణకు చర్యలు
ఇందల్వాయి: జాతీయ రహదారుల వెంట రోడ్డు దాటు తూ వాహనాలు ఢీ కొట్టి ఏటా పదుల సంఖ్యలో వన్య ప్రాణులు మృతి చెందుతున్నాయి. వీటి రక్షణకు అటవీ శాఖ వినతి మేరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రహదారుల వెంట ఉన్న అటవీ భూములకు ఇరువైపులా కంచెల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.
నాలుగు చిరుతలు, ఒక ఎలుగు..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న 44వ నంబరు జాతీయ రహదారి వెంబడి ముఖ్యంగా కామారెడ్డి జిల్లా సదాశివ్‌నగర్ మండలం దగ్గి ప్రాంతం నుంచి ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లి శివారులోనే గత ఎనిమిదేళ్లలో ఐదు చిరుతలు, ఒక ఎలుగుబంటి రహదారిపై రాత్రి వేళల్లో రోడ్డు దాటుతూ గుర్తు తెలియని వాహనాలు ఢీకొని మృత్యువాత పడ్డాయి. అందుకే ఈ ప్రాంతంలో వన్యప్రాణులు రోడ్డు పైకి రాకుండా కంచెల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.
ఆహారం కోసం..
ఆహారం, నీటి కొరత వల్ల కొత్త ఆవాసాలను వెతుక్కుంటూ వన్య ప్రాణులు వాటి పరిధి దాటి రోడ్లపైకి, జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రమాదాలకు గురై మరణిస్తున్నాయి. అవి ఎట్టి పరిస్థితుల్లో అడవుల ద్వారా రోడ్లపైకి రాకుండా 8 ఫీట్ల ఎత్తులో పటిష్టమైన చైన్‌లింక్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల వన్యప్రాణులు అడవి దాటడానికి, దూకడానికి కాని వీలుపడదు. ఈ చర్యల వల్ల వన్యప్రాణులు రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా అడ్డుకోనున్నారు. ఇక్కడ మంచి ఫలితాలు వస్తే రాష్ట్రమంతట జాతీయ రహదారుల వెంట అడవులు ఉన్న ప్రతిచోట రెండు వైపుల ఫెన్సింగ్ వేయనున్నారు.
మేలో చంద్రాయన్‌పల్లి వద్ద హైవేపై మృతి
చెందిన చిరుత
గత వేసవిలో తిర్మన్‌పల్లి వద్ద హైవేపై మృతి
చెందిన ఎలుగుబంటి
రహదారుల వెంట అటవీ భూములకు కంచెలు ఏర్పాటు చేయడంలో పైలట్ ప్రాజెక్ట్‌గా రాష్ట్రంలో మొదట 44వ నంబరు జాతీయ రహదారిని ఎంచుకున్నారు. ఇందులో ముఖ్యంగా గతంలో ఎక్కువ వన్యప్రాణులు మృతి చెందిన కామారెడ్డి–నిజామాబాద్ మార్గ మద్యలో ఐదు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతాన్ని గుర్తించి గ్రౌండ్ వర్కింగ్ పనులు చేయడంలో అటవీ, రహదారుల అధికారులు నిమగ్నమయ్యారు.
చర్యలు వేగవంతం
అటవీ శాఖ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని హైవే అథారిటి ఆఫ్ ఇండియా ఫెన్సింగ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టడం హర్షనీయం. ఉమ్మడి జిల్లాలో మంచిప్ప, చంద్రాయన్‌పల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాల్లో ఐదు కిలోమీటర్ల పొడవునా అడవులు ఉన్నాయి. రెండు వైపులా సుమారుగా పది కిలో మీటర్ల మేర ఫెన్సింగ్ ఏర్పాటుకు అటవీ, హైవే అథారిటీ అధికారులు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. దసరా తర్వాత ఫెన్సింగ్ వేసే పనులు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాహనదారులు సైతం అటవీ ప్రాంతాల్లో నిర్దేశించిన వేగ నియంత్రణ పాటించాలి. – వికాస్ మీనా, జిల్లా ఫారెస్ట్ అధికారి
రహదారుల వెంట అటవీ భూములకు కంచెలు
ఉమ్మడి జిల్లాలో పది కిలోమీటర్ల
పరిధిలో ఏర్పాటు
ఎనిమిది ఫీట్ల ఎత్తులో పటిష్టమైన
చైన్‌లింక్ ఫెన్సింగ్
రోడ్డు దాటుతూ వాహనాలు ఢీకొని
మరణిస్తున్న చిరుతలు, ఇతర వన్య ప్రాణులు

వన్య ప్రాణుల రక్షణకు చర్యలు

వన్య ప్రాణుల రక్షణకు చర్యలు

వన్య ప్రాణుల రక్షణకు చర్యలు