
పసుపు బోర్డు చైర్మన్‌కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ
సుభాష్‌నగర్: జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి జన్మదినం పురస్కరించుకుని బీజేపీతోపాటు వివిధ పార్టీల నాయకులు సోమవారం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంపీ ధర్మపురి అర్వింద్‌తోపాటు ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్‌రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర నాయకులు కలిసి, ఫోన్ల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. గంగారెడ్డి దంపతులు మామిడిపల్లిలోని అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బీజేపీ నాయకులు న్యాలం రాజు, ఆకుల శ్రీనివాస్, తారక్ వేణు, ఇప్పకాయల కిషోర్, సంగం అనిల్‌కుమార్, కార్యకర్తలు పుష్ఫగుచ్చమిచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.